Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
बुधवार, 25 दिसंबर 2024
webdunia
Advertiesment

కోవిడ్ 19పై ప్రభావవంతంగా పనిచేస్తుందని నిరూపితమైన షార్ప్‌ నేచురైజర్‌ శానిటైజర్‌ సొల్యూషన్‌

కోవిడ్ 19పై ప్రభావవంతంగా పనిచేస్తుందని నిరూపితమైన షార్ప్‌ నేచురైజర్‌ శానిటైజర్‌ సొల్యూషన్‌
, గురువారం, 10 ఫిబ్రవరి 2022 (15:46 IST)
వినూత్నమైన సాంకేతిక ఉత్పత్తులు, పరిష్కారాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన షార్ప్‌ కార్పోరేషన్‌ జపాన్‌కు పూర్తి అనుబంధ భారతీయ సంస్థ షార్ప్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ నేడు సహజసిద్ధమైన ఉప్పు ఆధారిత శానిటైజర్‌ మేకర్‌ షార్ప్‌ నేచురైజర్‌ ప్రతిష్టాత్మకమైన మైలురాయిని చేరుకున్నట్లుగా వెల్లడించింది. కొవిడ్‌ (సార్స్‌-కోవ్-2 డెల్టా వేరియంట్‌)పై ప్రభావవంతంగా ఇది పనిచేయడంతో పాటుగా 99% వరకూ వైరస్‌ కౌంట్‌ను  ఈ సొల్యూషన్‌ ఉపయోగించిన ఒక్క నిమిషం లోపుగానే తగ్గిస్తుందని నిర్ధారించింది.

 
ఈ శానిటైజర్‌ సొల్యూషన్‌ యొక్క వైరస్‌ సంహారక ప్రక్రియను ఫలకపు పరీక్ష (ప్లేక్‌ ఎస్సే) పద్ధతిలో చేశారు. ఈ పరీక్షను ఐఐఎస్‌సీలోని  సెంటర్‌ ఫర్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజ్‌ అండ్‌ బయోసేఫ్టీ ల్యాబ్‌ వద్ద ఏర్పాటుచేసిన బీఎస్‌ఎల్‌3 ల్యాబ్‌ వద్ద నిర్వహించారు. దీనికోసం, తాజాగా సిద్ధం  చేసిన ఎలకో్ట్రలైజ్డ్‌ సాల్ట్‌ వాటర్‌ (ఈఎస్‌డబ్ల్యు) (1ఎక్స్‌)ను సార్స్‌-కోవ్-2 వైరస్‌ సస్పెన్షన్‌తో మిక్స్‌ చేశారు మరియు దీనిని 0, 1, 5 మరియు 15 నిమిషాల కాల వ్యవధిలలో ఇన్‌క్యుబేట్‌ చేశారు. వీటిని సీరియల్‌గా ఐస్‌ కోల్డ్‌ డెమెమ్‌ పలుచన(10 రెట్లు)  చేశారు. ఈ పలుచగా చేసిన నమూనాలను వెరో-ఈ6 సెల్స్‌పై  ఫలక పరీక్ష కోసం వినియోగించారు.

 
ఈ ఫలక పరీక్ష డాటా చూపిన దాని ప్రకారం ఈఎస్‌డబ్ల్యు శుద్ధి తరువాత ఒకటి మరియు 5 నిమిషాల తరువాత వరుసగా 2–3లాగ్‌ 10 మరియు 4లాగ్‌ 10 రెట్లు వైరల్‌ టైటర్‌ తగ్గినట్లుగా ఫలక పరీక్ష సూచించింది. 15 నిమిషాల ఎక్స్‌పోజర్‌ సమయంలో, ఈఎస్‌డబ్ల్యు ఈ వైరస్‌ను గుర్తించతగిన పరిమితి కన్నా తక్కువగా తగ్గించింది. ఈ ఫలితంగా వైరల్‌ టైటర్‌ 7లాగ్‌10 మించి తగ్గింది.

 
షార్ప్‌ నేచురైజన్‌ 100% సహజసిద్ధమైనది మరియు పోర్టబల్‌ శానిటైజర్‌ మేకర్‌. ఇది తాగు నీరు మరియు టేబుల్‌ సాల్ట్‌ ఉపయోగించి సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం తయారుచేస్తుంది. ఇది ప్రకృతి యొక్క సహజసిద్ధమైన డిస్‌ఇన్‌ఫెక్టెంటెంట్‌. ఇది 500+ పీపీఎం రెసిడ్యుల్‌ క్లోరిన్‌ కలిగి ఉంది. ఇది బ్యాక్టీరియా మరియు వైరస్‌ను 1 నిమిషం లోపుగానే 99% వరకూ తగ్గిస్తుంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ అధ్యయనాలు మరియు రిఫరెన్స్‌లు ప్రకారం 500+ పీపీఎం క్లోరిన్‌ రెసిడ్యు (అవశేషాలు)ను కోవిడ్ 19 వ్యాప్తి నిరోధకానికి పర్యావరణ ఉపరితలాలపై డిస్‌ఇన్‌ఫెక్షన్‌ కోసం వాడటానికి సూచించడమైనది.

 
ఈ ఫలితాలను గురించి షార్స్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ షింజి మినటోగవా మాట్లాడుతూ, ‘‘ మెరుగైన జీవనం కోసం నూతన ప్రమాణాలతో ఒత్తిడి లేని, ఆరోగ్యకరమైన, సురక్షిత మరియు పర్యావరణ పరంగా సంరక్షించబడిన కార్యాలయాలను సృష్టించడం ద్వారా భారతదేశంలో వ్యాపార కొనసాగింపుకు షార్ప్‌ కట్టుబడి ఉంది. షార్ప్‌ నేచురైజర్‌తో ఆచరణాత్మక పరిష్కారాలతో  కార్యాలయాలు మరియు గృహాలను సన్నద్ధం చేయడంపై దృష్టి పెట్టాము. ఇవి వినియోగించడానికి సులభమైనవి, ప్రభావవంతమైన రక్షణను నిర్ధారించడంతో పాటుగా కోవిడ్‌ విస్తరణను నియంత్రిస్తుంది. షార్ప్‌ నేచురైజర్‌ను ఇప్పటికే సుప్రసిద్ధ పనిప్రాంగణాలలో వినియోగిస్తున్నారు. ఈ నూతన సర్టిఫికేషన్‌తో మరిన్ని వ్యాపార సంస్థలు ఈ పరిష్కారాలను వినియోగించుకోగలవని నమ్మకంగా ఉన్నాము మరియు పనిప్రాంగణాల వద్దకు పూర్తివిశ్వాసంతో వస్తారని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.

 
ఈ సహజసిద్ధమైన డిస్‌ఇన్‌ఫెక్టెంటెంట్‌ బ్యాక్టీరియా యొక్క కణాకృతిని నాశనం చేస్తుంది. ఇది బ్యాక్టీరియా కణజాల గోడలను మరియు వైరస్‌ యొక్క ప్రొటీన్‌  కోట్స్‌ను నాశనం చేస్తుంది. దీని అతి తక్కువ మాలిక్యులర్‌ బరువు కారణంగా కణజాల గోడలలోనికి ప్రభావవంతంగా చొచ్చుకుపోవడంతో పాటుగా వేగంగా చర్యలనూ తీసుకుంటుంది. ఇది బ్యాక్టీరియా మరియు వైరస్‌ల డీఎన్‌ఏ మరియు ఆర్‌ఎన్‌ఏను నాశనం చేస్తుంది

 
ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్లలా కాకుండా షార్ప్‌  పూర్తి సహజసిద్ధమైన మరియు పోర్టబల్‌ పరిష్కారాలను నిరూపిత ప్రభావంతో అందిస్తుంది. దాదాపుగా సున్న నిర్వహణ ఖర్చుకలిగి ఉండటంతో  పాటుగా ఫైర్‌ సేఫ్టీ లక్షణాలు కలిగిన  ఇది ఉపరితల ఇన్‌ఫెక్షన్‌ను నివారించడానికి పని ప్రాంగణాలు మరియు  గృహ వాతావరణంలో అనుకూలంగా ఉంటుంది. ఈ శానిటైజర్‌ సొల్యూషన్‌ను అన్ని రకాల ఉపరితలాలు అయిన వర్క్‌టేబుల్స్‌, చైర్స్‌, క్యాబిన్స్‌, కాన్ఫరెన్స్‌ గదులు, పంచుకునేటటువంటి వనరులు అయిన మల్టీ ఫంక్షన్‌ ప్రింటర్లు, ఫోన్లు, ఇతర ఆఫీసు ఉత్పత్తుల వద్ద వాడవచ్చు. అదనంగా, ఈ వినూత్నమైన పరిష్కారమైన సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంను షార్ప్‌ నేచురైజర్‌ ఉత్పత్తి చేస్తుంది. దీనిని కారు ఇంటీరియర్స్‌, గ్లాస్‌ ఉపరితలాలు, ఆఖరకు పండ్లు, కూరగాయలపైకూడా వాడవచ్చు.

 
షార్ప్‌ నేచురైజర్‌ శానిటైజర్‌ మేకర్‌, సుదీర్ఘకాలం పాటు పనిచేస్తుంది. పునర్వినియోగించతగిన లక్షణాలు ఇది కలిగి ఉంది.  ప్లాస్టిక్‌ వ్యర్థాలను తగ్గించడంతో పాటుగా దాదాపు 7500 శానిటైజర్‌ బాటిల్స్‌ వ్యర్థాలలో చేరకుండా అడ్డుకుంటుంది. తద్వారా వాతావరణానికి సానుకూలంగా తోడ్పడుతుంది. సహజసిద్ధమైన శానిటైజర్‌ మేకర్‌ షార్ప్‌ నేచురైజర్‌ ధర 10,950 రూపాయలు.

 
షార్ప్‌ గతంలో 3డీ సెక్యూర్‌– టోటల్‌ వర్క్‌స్పేస్‌ ప్రొటెక్షన్‌ సొల్యూషన్‌ పరిచయం చేసింది. దీనిలో ఇన్‌స్టెంట్‌ సర్ఫేస్‌ డిస్‌ఇన్‌ఫెక్టెంటెంట్‌ షార్ప్‌ నేచురైజర్‌ కూడా ఉంది.వర్క్‌స్పేస్‌ ప్రొక్యాట్‌ అనేది డిస్‌ఇన్‌ఫెక్టెంటెంట్‌ కోటింగ్‌ సర్వీస్‌ మరియు ప్లాస్మాక్టస్టర్‌ అనేది వాణిజ్య ఎయిర్‌ ప్యూరిఫైయర్‌. ఇది 24 గంటలూ వైరస్‌, బ్యాక్టీరియా, మోల్డ్‌, చెడువాసనల నుంచి రక్షణ అందిస్తుంది.
 
 
సార్స్‌ కోవ్‌ 2 లాగ్‌ మరియు పర్సెంట్‌ తగ్గింపును ఫలక పరీక్షలో ఈఎస్‌డబ్ల్యుకు ఎక్స్‌పోజర్‌ చేసిన తరువాత విభిన్నమైన కాల వ్యవధిల(0,1,5,15 నిమిషాలు)లో గమనించారు. ఈ డాటా యొక్క కంబైన్డ్‌ డాటా ను ఈ దిగువ సూచించిన రీతిలో గమనించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రాలో మళ్లీ తెలంగాణను కలిపినా కలుపుతారు.. హరీష్ రావు