దేశంలో పండగ సీజన్ మొదలైంది. దీంతో దేశవ్యాప్తంగా బంగారం విక్రయాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. మహిళలు ఆభరణాలు, బంగారం కొనుగోళ్లకు ప్రాధాన్యమిస్తారు. ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం నుంచి బయటపడుతున్నారు.
ఈ నేపథ్యంలో సెప్టెంబరులో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే గత నెలలో 658 శాతం దిగుమతులు పెరిగాయి. 2020 ఆగస్టులో ఔన్స్ బంగారం ధర 2072 డాలర్లకు పెరిగి ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది.
ప్రస్తుతం 15 శాతం తగ్గింది. అయితే, బంగారం దిగుమతులు పెరగడంతో దేశీయ వాణిజ్య లోటు పెరిగిపోయింది. ఫలితంగా రూపాయికి డారల్‌కు మధ్య అంతరం పెరిగింది.
గతేడాదితో పోలిస్తే గత నెలలో బంగారం దిగుమతులు 91 టన్నులు పెరిగాయి. గతేడాది కవేలం 12 టన్నులు మాత్రమే విలువపరంగా గతేడాది సెప్టెంబర్‌లో దిగుమతైన బంగారం విలువ 601 మిలియన్ల డాలర్లు అయితే, ఈ ఏడాది 5.1 బిలియన్ల డాలర్లకు పెరిగాయి.
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బంగారం దిగుమతులు 170 శాతం పెరిగి 288 టన్నులకు చేరాయి. లోకల్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.45,479 (611.93 డాలర్లు)కు పడిపోయింది. బంగారం కొనుగోళ్లకు రిటైల్ డిమాండ్ పెరిగింది.