Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇక... రూ.5, 10, 20, 50, 100 నోట్ల వంతు.. ఏక్షణమైనా రద్దు ప్రకటన!?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో వేళ్లూనుకునిపోయిన అవినీతిని కూకటి వేళ్ళతో పెకళించే వేసేందుకు వీలుగా కరెన్సీ నోట్లతో ప్ర

Advertiesment
ఇక... రూ.5, 10, 20, 50, 100 నోట్ల వంతు.. ఏక్షణమైనా రద్దు ప్రకటన!?
, శుక్రవారం, 11 నవంబరు 2016 (11:01 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో వేళ్లూనుకునిపోయిన అవినీతిని కూకటి వేళ్ళతో పెకళించే వేసేందుకు వీలుగా కరెన్సీ నోట్లతో ప్రక్షాళన చేపట్టాలని భావిస్తోంది. ఇందులోభాగంగా ఇప్పటికే రూ.500, రూ.1000 నోట్లను ప్రధాని మోడీ రద్దు చేశారు. ఈ నిర్ణయం నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించేలా చేసింది. 
 
మరోవైపు మరో సంచలన నిర్ణయం తీసుకోనుందనే వార్తలు వస్తున్నాయి. ఈ దఫా 5 ,10 , 20 , 50 ,100 రూపాయల నోట్లు కూడా తొలగించే దిశగా అడుగులు వేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. భారత కరెన్సీని సమూలంగా మార్చడంతో పాటు మరిన్ని అదనపు సెక్యూరిటీ ఫీచర్లను జోడించడమే లక్ష్యంగా అన్ని కరెన్సీ నోట్లనూ రద్దు చేసి.. వాటి స్థానంలో కొత్త నోట్లను దశలవారీగా ప్రవేశపెట్టనున్నట్టు ఆర్థిక శాఖ ప్రకటించింది.
 
ఇదే అంశంపై ఆర్థిక శాఖ వ్యవహారాల కార్యదర్శి శశికాంత్ దాస్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ చలామణిలో ఉన్న అన్ని రకాల కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుని వాటి స్థానంలో కొత్త డిజైన్, ఫీచర్లతో ఉండే కరెన్సీని ప్రవేశపెడతామన్నారు. 5 ,10 , 20 , 50 ,100 రూపాయల నోట్లు కూడా కొత్తవి వస్తాయని చెప్పారు. ప్రస్తుతం కరెన్సీ బట్వాడా శరవేగంగా సాగుతోందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ ముద్రణపై నరేంద్ర మోడీ దెబ్బ... ఉగ్రవాదుల ఆర్థిక వనరులకు మరణశాసనం