Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్యాంకు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే ఫైన్!

మీరు మీ బ్యాంకు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయడంలేదా? అయితే అయితే ఫైన్ కట్టేందుకు రెడీగా ఉండాలని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. కొద్దికాలం క్రితం వరకు ఉన్న ఈ నిబంధనను ఆర్బీఐ తొలగించింది.

బ్యాంకు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే ఫైన్!
, ఆదివారం, 5 మార్చి 2017 (13:02 IST)
మీరు మీ బ్యాంకు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయడంలేదా? అయితే అయితే ఫైన్ కట్టేందుకు రెడీగా ఉండాలని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. కొద్దికాలం క్రితం వరకు ఉన్న ఈ నిబంధనను ఆర్బీఐ తొలగించింది. అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు చోటుచేసుకుంటున్నాయి.

ఇందులోభాగంగానే మినిమమ్ బ్యాలెన్స్ లేనివారిపైనా, నెలకు 4, 5 ఏటీఎం లావాదేవీలు, నగదు లావాదేవీలు జరిపే వారిపైనా ఛార్జెస్ వేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. గతంలో ఎప్పుడో ఆపివేసిన మినిమమ్ బ్యాలెన్స్ లిమిట్‌ను మళ్లీ అమలు చేసేందుకు ఎస్బీఐ సిద్ధమైంది. మిగిలిన బ్యాంకులు కూడా ఈ వైపుగా ఇప్పటికే కసరత్తులు చేస్తున్నాయి. 
 
ఎస్‌బీఐ విషయానికి వస్తే.. మినిమమ్ బ్యాలెన్స్ విధానాన్ని ఎస్‌బీఐ 2012లో ఆపేసింది. ఏప్రిల్‌ 1 నుంచి తిరిగి అమలు చేయాలని ఆ బ్యాంకు నిర్ణయించినట్లు బిజినెస్‌ స్టాండర్డ్‌లో వచ్చిన కథనం పేర్కొంది. పొదుపు ఖాతాల నిర్వహణకు అయ్యే వ్యయానికి ఈ మొత్తాన్ని ఉపయోగించుకుంటుంది. మెట్రోపాలిటిన్‌ ప్రాంతాల్లో పొదుపు ఖాతాల వినియోగదారులు నెలవారీ సగటు బ్యాలెన్సును రూ.5 వేలు ఉండేలా చూసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొత్తం రూ.1000 అని బ్యాంకు చెబుతోంది. జరిమానాగా రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తారు. సర్వీస్ ట్యాక్స్ దీనికి అదనంగా వసూలు చేయనున్నారట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిలయన్స్ జియో షాక్ : 3 నెలల్లో ఏదో ఒక ప్యాక్‌తో రీచార్జ్ చేయకుంటే సర్వీస్‌లన్నీ బంద్