కొత్త రూ.2వేలు, రూ. 200 నోట్లు చిరిగితే.. బ్యాంకులు తీసుకోవట్లేదు.. ఎందుకంటే?
రూ.2వేలు, రూ.200 కరెన్సీ నోట్లను భద్రంగా కాపాడుకోవాలట. ఎందుకంటే ఇక పాత కరెన్సీలా చిరిగిన నోట్లను బ్యాంకులు ఇక తీసుకోవు. షాకవుతున్నారు కదూ.. అవునండి ఇది నిజమే. నోట్లు కొద్దిగా చిరిగితే బ్యాంకులు వాటికి
రూ.2వేలు, రూ.200 కరెన్సీ నోట్లను భద్రంగా కాపాడుకోవాలట. ఎందుకంటే ఇక పాత కరెన్సీలా చిరిగిన నోట్లను బ్యాంకులు ఇక తీసుకోవు. షాకవుతున్నారు కదూ.. అవునండి ఇది నిజమే. నోట్లు కొద్దిగా చిరిగితే బ్యాంకులు వాటికి విలువ కట్టిస్తాయి. కానీ ఇది పాత కథ. ఇక కొత్త 2వేల రూపాయల నోటు, రూ.200 నోటు చిరిగితే ఇక బ్యాంకులు తీసుకోవు. కనీసం సగం విలువను కూడా కట్టివ్వవు. అంతేకాదు.. చిరిగిపోయిన రూ.2000 నోటును మార్చుకునేందుకు కొంతకాలం ఆగాల్సి వుంటుంది.
ఎందుకంటే ఈ విషయమై రిజర్వ్‌బ్యాంక్ నుంచి ఇప్పటిదాకా ఎటువంటి నిబంధనలూ బ్యాంకులకు రాలేదు. వాస్తవంగా చిరిగిపోయిన నోటుకు ఎంత విలువ కట్టి ఇవ్వాలనే విషయమై గతంలోనే ఆర్‌బీఐ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటివరకు 50, 100, 500,1000 రూపాయలకు మాత్రమే ఆర్బీఐ మార్గదర్శకాలను అమలు చేస్తున్నారు. కానీ కొత్తగా చలామణిలోకి వచ్చిన రూ.2వేలు, రూ.200 నోట్లకు సంబంధించి ఆర్‌బీఐ నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో బ్యాంకులు చిరిగిన నోట్లను స్వీకరించేందుకు తిరస్కరిస్తున్నాయి. అదన్నమాట సంగతి.