Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.2 వేల నోటు రద్దు?!.. త్వరలో రూ.వెయ్యి నాణెం? మౌనం అంగీకారమా?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకోనున్నారా?. దేశంలో చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేసిన ప్రధాని.. వాటి స్థానంలో రూ.2 వేల నోటును ప్రవేశపెట్టారు. అలాగే, కొత్త రూ.500 న

Advertiesment
Rs.2
, గురువారం, 27 జులై 2017 (15:44 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకోనున్నారా?. దేశంలో చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేసిన ప్రధాని.. వాటి స్థానంలో రూ.2 వేల నోటును ప్రవేశపెట్టారు. అలాగే, కొత్త రూ.500 నోటును చలామణిలోకి తెచ్చారు. అయితే, గత కొన్ని రోజులుగా రూ.2 వేల నోటు ముద్రణను భారతీయ రిజర్వు బ్యాంకు నిలిపివేసింది. దీంతో రూ.2 వేల నోటును మళ్లీ రద్దు చేయడం ఖాయమనే కథనాలు మీడియాలో జోరుగా ప్రసారమవుతున్నాయి. 
 
అదేసమయంలో కొత్తగా రూ.200 నోటును ముద్రిస్తున్నట్టు సమాచారం. ఇంకోవైపు రూ.1000 నాణెను కూడా చెలామణిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు సమాచారం.ఈ నేపథ్యంలో... దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీ లభ్యత, రూ.2 వేల నోటు రద్దుపై వస్తున్న వదంతులు, అంచనాలపై రాజ్యసభలో దుమారం రేగింది. ముఖ్యంగా రూ.2 వేల నోటు రద్దు వార్తల ఆందోళన, వెయ్యి రూపాయల నాణెం ప్రవేశంలాంటి పుకార్ల నేపథ్యంలో పెద్దల సభలో ప్రతిపక్షాలు నిలదీశాయి. 
 
కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ... 1,000 రూపాయల నాణేలను ప్రవేశపెడుతున్నారా? లేదా? అనే అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. 1,000 రూపాయల నాణాలను మోసుకెళ్లడానికి ఒక బ్యాగ్‌ కొనుగోలు చేయాలా? తమకు తెలియాలంటూ చమత్కరించారు.
 
అలాగే, ఎస్పీ ఎంపీ నరేష్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రభుత్వం రూ.2,000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ రూ.2,000లను ప్రింట్ చేయకూడదని ఆదేశించింది. ఇలాంటి విధాన నిర్ణయాన్ని పార్లమెంటులో ప్రకటించడం సాంప్రదాయమన్నారు. అయితే, ప్రతిపక్ష సభ్యులు ఎంత వాదించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ అంశంపై ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ మౌనాన్నే ఆశ్రయించడం గమనార్హం​. అంటే విత్తమంత్రి మౌనం రూ.2 వేల నోటు రద్దు నిజమేనా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ క్లాస్: ఓపీఎస్‌కు ఉపముఖ్యమంత్రి పదవి: ఏకం కానున్న పళని-ఓపీఎస్ వర్గాలు..?