Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.1000 నోట్లను తీసుకురావట్లేదు : కేంద్ర ఆర్థికశాఖ వెల్లడి

గతంలో రద్దు చేసిన రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టే యోచనలేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. చిల్లర సమస్యలను తొలగించేందుకు ఇటీవల కొత్తగా రూ.200 నోట్లను రిజర్వు బ్యాంకు చెలామణీలోకి తెచ్చ

Advertiesment
Rs.1000 notes
, బుధవారం, 30 ఆగస్టు 2017 (08:49 IST)
గతంలో రద్దు చేసిన రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టే యోచనలేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. చిల్లర సమస్యలను తొలగించేందుకు ఇటీవల కొత్తగా రూ.200 నోట్లను రిజర్వు బ్యాంకు చెలామణీలోకి తెచ్చామని వివరణ ఇచ్చింది. అంతకుముందు కొత్త రూ.50 నోట్లను కూడా ఆర్‌బీఐ తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ రూ.1000 నోట్లను కూడా ప్రభుత్వం ప్రవేశపెడుతుందని వదంతులు మొదలయ్యాయి. ఈ వార్తలను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ కొట్టిపారేశారు.
 
కాగా, సోషల్ మీడియాలో రూ.వెయ్యి నోట్లను తిరిగి ప్రవేశపెట్టనుందే వార్తలు హల్‌చల్ చేస్తున్న విషయం తెల్సిందే. రూ. వెయ్యి నోటు తిరిగి కొత్త అవ‌తారంలో, మ‌రింత సెక్యూరిటీతో చ‌లామ‌ణిలోకి రానుందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, ఈ వార్తలన్నింటికీ కేంద్ర ఆర్థిక శాఖ ఫుల్‌స్టాఫ్ పెట్టింది. రూ.వెయ్యి నోటును తిరిగి ప్రవేశపెట్టే ఉద్దేశ్యం తమకు లేదని స్పష్టం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డేరా బాబా ఇల్లు ఓ ఇంద్రభవనం : గృహంలో కూడా కండోమ్స్... (Video)