ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. రెపోరేటు, రివర్స్ రెపోరేట్లను యధాతథంగా ఉంచారు. రెపో రేటను 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.25 శాతంగా ఉంచాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించిందని శక్తికాంతదాస్ వెల్లడించారు. దీంతో వరుసగా తొమ్మిదో సారి కూడా ఆర్బీఐ వడ్డీరేట్లను మార్చకుండా యధాతథంగా వుంచడం గమనార్హం.
అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం వల్ల వాటి డిమాండ్ పెరిగిందని శక్తికాంతదాస్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని, కోవిడ్ సంక్షోభాన్ని ఎదురుకోవడానికి సిద్ధంగా ఉన్నామని శక్తికాంతదాస్ వెల్లడించారు. 2022 వార్షిక సంవత్సరం నాటకి జీడీపీలో వృద్ధి రేటు టార్గెట్ 9.5 శాతంగా ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.