ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ బస్ టికెట్ అందజేసే ప్లాట్‌ఫామ్ అయిన రెడ్‌బస్, లక్షలాది మంది భారతీయ ప్రయాణికులకు బడ్జెట్-హితమైన వసతి సదుపాయాలను కల్పించడానికై తన సేవలను విస్తరిస్తూ రెడ్‌బస్ హోటళ్లను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించింది. వ్యూహాత్మకమైన ఈ కృషితో రెడ్‌బస్, దేశంలో ధరల పట్ల అవగాహన, అనుభవాన్ని కోరుకునే వాడుకదారుల పెరుగుతున్న సంఖ్యకు అనుగుణంగా ఒకే- చోటున ప్రయాణ సహచరిగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. రెడ్‌బస్‌తో ముడిపడి ఉన్న ఈ విశ్వాసం బడ్జెట్ కు తగిన హోటల్ విభాగానికి తీసుకువెళ్ళబడుతోంది.
ప్రస్తుతం 2000కు పైగా నగరాలలో క్రియాత్మకంగా పనిచేస్తున్న రెడ్‌బస్ హోటల్స్, వేగంగా స్థాయి పెంపుదల కాబడుతూ, నగరాలు మరియు చిన్న పట్టణాల వ్యాప్తంగా విశ్వసనీయమైన, సరిచూసుకోబడిన, స్థోమతకు తగిన వసతి సౌకర్యాలను సులభంగా కనుక్కోగలిగేలా మరింత ఎక్కువ ప్రాప్యత చేసుకునేలా చేయడం ద్వారా భారతదేశపు ప్రయాణ సదుపాయాలలో కీలకమైన అంతరాన్ని ప్రస్తావిస్తున్నాయి. ప్రయాణికుల ప్రయాణంలో స్థోమతకు తగిన, విశ్వసనీయమైన వసతి సౌకర్యపు ఎంపికల ఈ కొత్త అందజేత సహజమైన అనుబంధతను ప్రస్తావించడం ద్వారా రెడ్‌బస్ యొక్క ప్రధాన క్షేత్రస్థాయి రవాణా వ్యాపారానికి అండగా ప్రోత్సహిస్తుంది. కొద్దిపాటి బసలు, రాత్రిపూట బస చేయడం నుండి తీర్థయాత్రలు, విద్యార్థి మరియు వ్యాపారరీత్యా ప్రయాణాల వరకు, రెడ్‌బస్ హోటల్స్ భారతీయ కస్టమరుకు ఒక చివర నుండి మరో చివరి వరకు ప్రయాణ అనుభవాన్ని సులభతరం చేయాలని లక్ష్యంగా చేసుకుంది.
రెడ్‌బస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రకాష్ సంగం మాట్లాడుతూ ఇలా అన్నారు, మా ప్రధాన అందజేత నమ్మకమైన రవాణా వసతి సదుపాయాలను అందించడంలో ముందు భాగాన ఉంటోంది. మేము ఇప్పుడు ప్రయాణికులు మా నుండి ఆశించే అదే సౌలభ్యం, నమ్మకాన్ని వారికి అందిస్తూనే ఆ వాగ్దానాన్ని బడ్జెట్-హితమైన వసతి సదుపాయాలకు విస్తరిస్తున్నాము. రెడ్‌బస్ హోటళ్లతో, ప్రయాణికులు సమయాన్ని ఆదా చేసుకుంటూ, అనిశ్చితిని నివారిస్తూ, ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళకుండానే సరైన వసతిని కనుగొనడం కోసం ఆన్‌లైన్‌లో వెరిఫై చేయబడిన వసతి సదుపాయాలను పోల్చుకొని బుక్ చేసుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ బడ్జెట్ హోటళ్లు, హాస్టళ్లు, హోమ్‌స్టే యజమానులు తమ విజిబిలిటీని పెంచుకొని, ఆక్యుపెన్సీని మెరుగుపరచుకొని, తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఉద్దేశించబడింది అని అన్నారు
ఈ విస్తరణ యొక్క ప్రధాన లక్ష్యం బడ్జెట్ కు తగిన సేకరణ, గదులు రాత్రికి రూ. 399 నుండి మొదలవుతాయి, తరచుగా బస్సు టికెట్ కంటే చౌకగా ఉంటాయి. ₹499, ₹799, ₹999 లోపున వసతి సదుపాయాలతో, సౌలభ్యం లేదా నాణ్యతపై రాజీ పడకుండా సాటిలేని విలువను అందించడంపై ప్లాట్‌ఫామ్ దృష్టి సారించింది. సులభంగా అందుబాటులో ఉండేలా బస్ బోర్డింగ్ పాయింట్లు, రైల్వే స్టేషన్ల సమీపంలో నమ్మకమైన, శుభ్రమైన వసతి సదుపాయాల జాబితాను రెడ్‌బస్ రూపొందించింది. ఈ వేదికలో జాబితా చేయబడిన 15000 కంటే ఎక్కువ బస సౌకర్యాలలో ప్రయాణికులు ఒకేసారి ముందస్తు చెక్ ఇన్, అలాంటి సేవలను పొందవచ్చు. ప్రయాణికులు వివిధ రకాల సదుపాయాల నుండి ఎంచుకోవచ్చు- హోటళ్ళు, హాస్టళ్లు, అతిథిగృహాలు, లాడ్జీలు, హోమ్‌స్టేలు 45% వరకు రాయితీలతో, పండుగ సీజన్లలో మరింత అధికమైన తగ్గింపులతో పొందవచ్చు.
ఈ ప్లాట్‌ఫామ్ బడ్జెట్ ప్రయాణీకుడి ప్రాథమిక అవసరాలను తీరుస్తూ టీవీ, ఏసీ, ఉచిత వైఫైని అందించే బస సౌకర్యాలను జాబితా చేసే రెడ్‌బస్ ఛాయిస్‌తో వాడుకదారు నిర్ణయం తీసుకునే తీరును కూడా పెంపొందిస్తుంది. గమనించదగినట్లుగా, రెడ్‌బస్ హోటల్స్ యొక్క ప్రయోగాత్మక కార్యక్రమాలలో 18 నుండి 36 సంవత్సరాల వయస్సు గల వాడుకదారులు హోటల్ లావాదేవీలలో అత్యధిక వాటాను కలిగి ఉన్నారు, విద్యార్థులు, యువ నిపుణులు, బడ్జెట్-స్పృహ ఉన్న అన్వేషకులలో ఈ అందజేత యొక్క బలమైన ఆకర్షణ ప్రతిఫలిస్తోంది. 70 శాతం మంది వాడుకదారులు ఒకే గమ్యస్థానానికి ఒకటి కంటే ఎక్కువసార్లు తిరిగి ప్రయాణిస్తున్నట్లు గమనించబడించింది, ఇది భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ప్రయాణ నడవాలలో విశ్వసనీయమైన, పునరావృతమయ్యే వసతి సదుపాయాల అవసరాన్ని నొక్కి చెబుతుంది.
యాప్ (ఆండ్రాయిడ్- iOS) పైన రెడ్‌బస్ హోటల్స్ ని ప్రాప్యత చేసుకోవచ్చు. రెడ్‌బస్ యాప్ ప్రయాణం లోపున హోటల్ బుకింగ్ అనుభవం సజావుగా సమీకృతం చేయబడింది, టికెట్ బుకింగ్, ట్రాకింగ్ లేదా కొనుగోలు-అనంతర సమయంలో సందర్భోచితమైన ప్రాంప్ట్‌ల ద్వారా హోటల్ సూచనలు తెలియజేయబడతాయి.