స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ), కెనరా బ్యాంక్‌లపై సీరియస్ అయ్యింది. బ్యాంకింగ్ నిబంధనలు, ఆర్‌బిఐ ఆదేశాలను ఉల్లంఘించిన కారణంగా ఎస్బీఐ, కెనరా బ్యాంక్‌లపై జరిమానాలు విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సోమవారం ప్రకటించింది.
బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్‌ను పాటించనందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రూ.2కోట్ల జరిమానా విధించింది.
రిస్క్ అసెస్‌మెంట్ రిపోర్ట్ అలాగే ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్‌ను పరిశీలించినప్పుడు, కొన్ని కంపెనీల పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌లో 30 శాతం కంటే ఎక్కువ మొత్తంలో ఎస్‌బిఐ షేర్లను తాకట్టుగా ఉంచిందని తేలింది. ఇంకా అర్హత ఉన్న మొత్తాన్ని క్రెడిట్ చేయడంలో విఫలమైందని ఆర్‌బిఐ తెలిపింది.
బీఆర్ చట్టంలో నిర్దేశించిన మార్గాలను, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు క్రెడిట్ సమాచారాన్ని అందించడం, ఇతర నియంత్రణ చర్యల కోసం డేటా ఫార్మాట్'పై సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన కొన్ని ఆదేశాలను ఉల్లంఘించిన కారణం చేత కెనరా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ. 32.30 లక్షల జరిమానా విధించింది.