సాధారణంగా దేశంలో ఉన్న చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు చిరిగిన పక్షంలో ఆ నోటును ఏదేని ఖాతా కగిలిన బ్యాంకుకు తీసుకెళ్లి మార్చుకునే వెసులుబాటు ఉంది. అయితే, కొత్తగా ప్రవేశపెట్టిన రూ.200, రూ.2000 వేల నోట్ల విషయంలో మాత్రం భారత రిజర్వు బ్యాంకు సరికొత్త నింబంధనను ప్రవేశపెట్టింది. చిరిగిన నిడివిని బట్టి నోటు మార్పిడి విలువ ఉంటుందని పేర్కొంది.
తాజా నిబంధన ప్రకారం రూ.200 నోటు చిరిగిన నిడివి 39 చదరపు సెంటీమీటర్లున్నట్టయితే పూర్తి మార్పిడి విలువ పొందవచ్చు. రూ.2,000 నోటు 44 చదరపు సెంటీమీటర్ల లోపు చిరిగినప్పుడే పూర్తి మారకం విలువ ఉంటుంది. చిరిగిన కొత్త నోట్లు మార్పిడి చేసేందుకు బ్యాంకులు తిరస్కరిస్తున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ తాజా నిబంధన ప్రకటించింది.