Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుపతి కెప్టెన్లపై దృష్టి సారించిన రాపిడో: వారి విజయాన్ని వేడుక చేసుకుంటూ ముందుకు...

Rapido

ఐవీఆర్

, గురువారం, 1 ఫిబ్రవరి 2024 (18:29 IST)
భారతదేశానికి చెందిన ప్రముఖ ప్రయాణ యాప్ రాపిడో, దాని కెప్టెన్ల స్థిరత్వం, అసాధారణమైన సహకారానికి నివాళులర్పిస్తూ తిరుపతిలో తమ తొలి రివార్డ్స్-రికగ్నిషన్ వేడుకను నిర్వహించింది. తిరుపతి కార్యక్రమం 250 మంది కెప్టెన్‌లను ఒకచోట చేర్చింది, రాపిడో అధిరోహణపై వారి మహోన్నత తోడ్పాటును నొక్కి చెప్పింది.
 
అవార్డుల బహుకరణ, ఇంటరాక్టివ్ కార్యకలాపాలతో ప్రారంభించిన కార్యక్రమంలో సవాళ్లను అధిగమించడానికి స్ఫూర్తిదాయకమైన కథనాలను కెప్టెన్లు పంచుకున్నారు. ఆర్థిక స్థిరత్వాన్ని అందించడంలో రాపిడో యొక్క కీలక పాత్రను హైలైట్ చేశారు. ప్రతిష్టాత్మక అవార్డులతో పాటు, మైక్రోవేవ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, పవర్ బ్యాంక్‌లు, వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు వంటి ఆచరణాత్మక బహుమతులు వారికి అందించబడ్డాయి. ఇది రాపిడో కథనాన్ని రూపొందించడంలో కెప్టెన్ల కీలక పాత్రకు నిజమైన ప్రశంసలను సూచిస్తుంది.
 
ఈ సందర్భంగా ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి మాట్లాడుతూ, "కెప్టెన్ల సంక్షేమం, సాధికారత మా ముందున్న ముఖ్య ఆందోళన. ఆర్థిక సవాళ్లను అధిగమించటంలో, కెప్టెన్‌లకు మార్గనిర్దేశం చేయడంలో, నమ్మకమైన ఆదాయ వనరును అందించడంలో రాపిడో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ కార్యక్రమాలు మా అంకితభావం కలిగిన కెప్టెన్‌ల కోసం సురక్షితమైన, ఆధారపడదగిన ప్రయాణాన్ని ప్రోత్సహించడంలో మా నిబద్ధతను నొక్కి చెబుతున్నాయి" అని అన్నారు. 
 
తిరుపతి కార్యక్రమం తమ కెప్టెన్ల కీలక పాత్రను గుర్తించడంలో కంపెనీ యొక్క తిరుగులేని నిబద్ధతను నొక్కి చెప్పింది. ఈ అంకితభావానికి అతీతంగా, రాపిడో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు చురుకుగా దోహదపడుతుంది, ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో దాని నిబద్ధతను పటిష్టం చేస్తుంది. తిరుపతి కార్యక్రమం విజయాలను జరుపుకోవడమే కాకుండా కెప్టెన్‌లకు నెట్‌వర్కింగ్, వృద్ధి అవకాశాలను అందించింది, దాని విజయానికి కీలక సహకారులుగా తమ కెప్టెన్‌లకు రాపిడో అందిస్తున్న విలువను ప్రదర్శిస్తుంది. ఉపాధి కల్పన ప్రధానాంశంగా, రాపిడో రాక, పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు చేయడంలో దాని కెప్టెన్‌లు పోషించిన కీలక పాత్రను గుర్తించి, అభినందిస్తూ దాని నిబద్ధతను కొనసాగిస్తోంది, తద్వారా రాష్ట్ర ఉపాధి రంగానికి గణనీయంగా తోడ్పడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేతన జీవులకు నిరాశేనా? కొత్త పన్ను విధానం ఎంచుకున్నవారికే మేలా?