Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ పిచ్చి రాతల వల్ల నాకు చిక్కులు ఎదురవుతున్నాయి : రఘురాం రాజన్

Advertiesment
Raghuram Rajan
జాతీయ మీడియాపై భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ (ఆర్.బి.ఐ) రఘురాం రాజన్ మండిపడ్డారు. మీరు రాసే పిచ్చి రాతల వల్ల తనకు అనేక చిక్కులు ఏర్పడుతున్నట్టు పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా రఘురాం రాజన్ మళ్ళీ ఆర్బీఐ గవర్నర్ అవుతారా? లేదా? అంటూ వస్తున్న కథనాల వల్ల తాను చిక్కుల్లో పడుతున్నట్టు చెప్పారు. ప్రెస్ వ్యవహారశైలి, తాను లేఖలు రాసినట్లు ప్రచురించిన వార్తల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఆర్బీఐ గవర్నర్ పదవి గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆ నిర్ణయం జరిగిన తర్వాతే మీకు తెలుస్తుందని చెప్పుకొచ్చారు. 
 
మరోవైపు వచ్చే సెప్టెంబరులో రాజన్ పదవీకాలం ముగియనుంది. ఆ తర్వాత ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా ఉండాలని కోరుకోవడం లేదనీ అమెరికాకు వెళ్లి స్థిరపడనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలతో డాలర్‌తో రూపాయి మారకం విలువ వారం క్రితం స్థాయికి దిగజారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జంపింగ్‌కు జగన్ పార్టీ ఎమ్మెల్యే రెడీ... 20 పూర్తి చేస్తారట...