లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ సర్కారు చివరి బడ్జెట్‌ను ప్రవేశబెట్టబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి చరిత్రపుటల్లోకి ఎక్కబోతున్నారు. ఈ బడ్జెట్‌లో ఎన్నికల తాయిలాలు ఉండే అవకాశం ఉంది.
మరోవైపు, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు... ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.14 పెంచారు. ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1,769.50కి చేరుకుంది.
స్థానిక పన్నులను బట్టి ఈ ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఇప్పటి నుంచి సిలిండర్ బుక్ చేసుకునే వారు పెరిగిన ధరను చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరలను మాత్రం పెంచలేదు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను చివరిసారిగా మార్చ్ 1వ తేదీన మార్చారు.