Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

పియాజియో నుంచి నమ్మకమైన 435సీసీ మెకానికల్‌ ఇంజిన్‌తో ఆపే ఆటో క్లాసిక్‌ విడుదల

Advertiesment
Auto
, బుధవారం, 16 నవంబరు 2022 (19:38 IST)
పియాజియో వెహికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పీవీపీఎల్‌) ఇటాలియన్‌ పియాజియో గ్రూప్‌కు 100% అనుబంధ సంస్థ, భారతదేశంలో సుప్రసిద్ధ చిన్న వాహనాల తయారీదారు నేడు అపే ఆటో క్లాసిక్‌ను ఆ సంస్థ ఛైర్మన్‌, ఎండీ శ్రీ డిగో గ్రాఫీ; ఈవీపీ, హెడ్‌ డొమెస్టిక్‌ బిజినెస్‌ సీవీ(ఐసీఈ), రిటైల్‌ ఫైనాన్స్‌ శ్రీ సాజు నాయర్‌ సమక్షంలో విడుదల చేసింది.
 
అపే ఆటో క్లాసిక్‌లో అత్యంత నమ్మకమైన 435 సీసీ ఎయిర్‌ కూల్డ్‌ మెకానికల్‌ పుల్లీ అసిస్ట్‌ వ్యవస్థతో డీజిల్‌ ఇంజిన్‌ ఉంది. ఈ ఆటో అత్యుత్తమ శ్రేణి మైలేజీ, అత్యధిక పని సామర్థ్యం, అతి తక్కువ నిర్వహణ వ్యయంతో వస్తుంది. దీనిలో 10 లీటర్ల ఇంధన ట్యాంక్‌సామర్ధ్యం ఉంది, అందువల్ల లాస్ట్‌ మైలు మొబిలిటీకి అత్యుత్తమంగా నిలుస్తుంది. ఇది పుల్లీ అసిస్ట్‌ సిస్టంతో వస్తుంది. దీనివల్ల అత్యంత సవాల్‌తో కూడిన పరిస్థితులలో సైతం వాహనాన్ని సౌకర్యవంతంగా ప్రారంభించడం వీలవుతుంది. ఈ వాహనం 42 నెలల సూపర్‌ వారెంటీతో వస్తుండటంతో అతి సులభంగా సర్వీసింగ్‌, అందుబాటు ధరలలో విడిభాగాలు ఉండటం వల్ల ఈ వాహన యజమానికి  సౌకర్యవంతమైన యాజమాన్య అనుభవాలు లభిస్తాయి.
 
అపే ఆటో క్లాసిక్‌ వాహనాలు అత్యున్నత నిర్మాణ నాణ్యత, ఆకర్షణీయమైన, ఆధునిక డ్యాష్‌ బోర్డ్‌, చూడగానే ఆకట్టుకునే ఉనికితో వస్తాయి. ఈ ఆటోలో  విశాలవంతమైన డ్రైవర్‌ క్యాబిన్‌ ఉంటుంది. దీనితో పాటుగా తగినంతగా లగేజీ స్పేస్‌ ఉండటం వల్ల ప్రతి ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. ఈ సందర్భంగా పియాజియో వెహికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌-మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ డిగో గ్రాఫీ మాట్లాడుతూ, ‘‘పియాజియో అపే శ్రేణి వాహనాల నుంచి అత్యధికంగా విక్రయించబడుతున్న మూడు వాహనాలలో ఒకటైన అపే ఆటో క్లాసిక్‌ను తిరిగి తీసుకువస్తున్నామని వెల్లడించేందుకు సంతోషిస్తున్నాము.


విస్తృతశ్రేణిలో వినియోగదారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తరువాత, మేము మెరుగైన అపే ఆటో క్లాసిక్‌ను విడుదల చేయడమన్నది. అత్యద్భుతమైన పవర్‌ ప్యాక్డ్‌ పెర్‌ఫార్మింగ్‌ వాహనాలను అందించాలనే మా ప్రయత్నంలో భాగం. ఈ వాహనం మా వినియోగదారుల కోసం ఉపాధి కల్పనను పెంచడంలో ఈ ఆటో తోడ్పడుతుందని మరియు అత్యుత్తమ లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ పరిష్కారాలను అందించడానికి తమ వినియోగదారులతో పాటుగా పియాజియో మరింతగా వృద్ధిని సాధించడానికి తోడ్పడుతుందని విశ్వసిస్తున్నాము’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జి-20 అధ్యక్ష బాధ్యతలు ప్రధాని నరేంద్ర మోడీకి అప్పగింత