గత మే నెలలో పెరిగిన పెట్రో, డీజిల్ ధరలను మంగళవారం మరోసారి పెంచారు. ఈ సారి లీటర్ పెట్రోల్‌పై రూ.2.58 పెంచగా డీజిల్‌పై రూ.2.26 పెంచినట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. గతంలో మే 17వ తేదీ పెట్రో, డీజిల్ ధరల్ని పెంచిన కంపెనీలు, జూన్ ఒకటో తేదీన మరోమారు పెంచాయి. పెట్రోల్, డీజిల్... రెండింటి ధరలను రెండున్నర రూపాయల మేర పెంచుతూ ప్రజలపై తీవ్రభారం మోపాయి.
తాజా ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌కు రూ.65.60, డీజిల్ రూ.53.93 వసూలు చేస్తారు. పెంచిన ధరలు మంగళవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ముడిచమురు ధరల్లో మార్పులు, డాలర్ మారకం విలువల వల్లే ధరలు పెంచినట్లు ఐఓసీ వెల్లడించింది. కాగా హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.2.72 పెరిగి రూ.69.89 కి చేరుకోగా,లీటర్ డీజిల్ ధర రూ.2.48 పెరిగి రూ. 58.74కు చేరింది.