ఆధార్-పాన్ కార్డు లింకు-మార్చి 31, 2019 వరకు గడువు పొడిగింపు
జూన్30వ తేదీతో ఆధార్-పాన్ కార్డు లింకుకు చివరితేదీగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆధార్-పాన్ కార్డు లింకుకు తేదీని కేంద్రం పొడిగించింది. ఈ గడువును 2019, మార్చి31 వరకు పెంచుతున్నట్లు
జూన్30వ తేదీతో ఆధార్-పాన్ కార్డు లింకుకు చివరితేదీగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆధార్-పాన్ కార్డు లింకుకు తేదీని కేంద్రం పొడిగించింది. ఈ గడువును 2019, మార్చి31 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీటీఐ).
శనివారంతో గడువు ముగిసిన క్రమంలో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 119 మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదేశాలు జారీచేసింది. ఆధార్‌తో వ్యక్తుల పాన్ నెంబర్ లింకింగ్ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించడం ఇది ఐదోసారి కాగా.. ఈ ఏడాది మార్చి 27న చివరిసారి పొడిగించారు.
ఆధార్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించే వరకు గడువును పొడిగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఐటీ రిటన్స్ దాఖలుకు, కొత్త పాన్ కార్డు కోసం ఆధార్ నెంబరును గతేడాది కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
ఇంకా ఆధార్‌తో ఇతర సేవల అనుసంధానం కోసం ఇచ్చిన గడువును మార్చి 31, 2018 నుంచి పొడిగించాలని ఈ ఏడాది ప్రారంభంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరతు సీబీటీఐ మార్చి 31, 2019 వరకు గడువును పెంచింది.