Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాజిటివ్ మార్పు కోసం ఎన్.జి.ఓ.లతో ఆప్టమ్ వాలంటీర్స్

image
, సోమవారం, 30 అక్టోబరు 2023 (23:07 IST)
ఆప్టమ్ టీమ్ మెంబర్లు హైదరాబాద్ వ్యాప్తంగా బహుళ ఎన్.జి.ఓ.లలో వాలంటీరింగ్ చేసారు, వారు స్థానిక సంఘాలతో కలిసి పాజిటివ్ మార్పు కోసం పనిచేసారు. ఇది ఆప్టమ్ వారి 9వ వార్షిక జియోగ్రాఫికల్లీ ఇంక్లూసివ్ వాలంటీర్ ఈవెంట్‌ (G.I.V.E.). ఇది అక్టోబర్ 3-15, 2023 మధ్యలో జరిగింది. ఆప్టమ్ ప్రముఖ హెల్త్ సొల్యూషన్, కేర్ డెలివరీ ఆర్గనైజేషన్, ఇది ఫార్చ్యూన్ 5వ కంపెనీ అయిన యునైటెడ్ హెల్త్ గ్రూప్ (UHG)లో భాగం.
 
ఆప్టమ్ వాలంటీర్స్ ఈ క్రింది ఎన్.జి.ఓ.లతో కలిసి పని చేసారు,
శీతాకాల బట్టలను సేకరించే డ్రైవ్‌కు మద్ధతుగా గూంజ్ వారితో పని చేసారు.
LV ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ వారితో ప్రపంచ ఐసైట్ డే నాడు కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు.
థలసెమియా సికిల్ సెల్ సొసైటీ వారితో ఆప్టమ్ వారి కార్యాలయాలలో రక్త దాన శిబిరాలను నిర్వహించారు.
ఆదరణ వారితో నిరాహారులకు భోజనం వండి వడ్డించటం వంటివి చేసారు.
చైల్డ్ వేల్ఫేర్ ఆర్గనైజేషన్ ఫర్ హోలిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ (CHORD) ఎన్.జి.ఓ. పరిసరాలలో నిర్వహణా కార్యకలాపాలు చూడటం, భద్రత, ఆరోగ్యం ఇంకా స్టాఫ్ వారి శుభ్రతా సంబంధ విషయాలను పర్యవేక్షించటం.
ఆశ్రయ్ ఆకృతి వారి పిల్లలతో కళ, అల్లికలు మరియు ఆట పాటలతో కలిసి ఆడుకోవటం వంటివి చేసారు.
స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ పిల్లలతో కలిసి వారిని క్రీడల ద్వారా పాలుపంచుకొనేలా చేయటం వంటివి చేసారు.
 
G.I.V.E. ద్వారా సున్నితత్వం, సహానుభూతి ఇంకా ఆశావాద వాతావరణాన్ని పెంపొందించటం లక్ష్యం అలాగే టీమ్ మెంబర్లకు శ్రద్ధ, కరుణ చూపటానికి కలిసి పని చేయటానికి అనువైన వాతావరణం కల్పించటం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గచ్చిబౌలి స్టేడియంలో చంద్రబాబుకు సంగీత కచేరీ.. కోడలి అచ్చెరువు