పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం.. సామాన్యుడిపై మరింత భారం?
కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిపై భారం మోపేందుకు సంసిద్ధమవుతోంది. పెట్రోల్ ధరలను మరింత పెంచే దిశగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల అనిశ్చితి కొనసాగుతుండటంతో భారత్‌లో పెట్రోల్ ధరలు
కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిపై భారం మోపేందుకు సంసిద్ధమవుతోంది. పెట్రోల్ ధరలను మరింత పెంచే దిశగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల అనిశ్చితి కొనసాగుతుండటంతో భారత్‌లో పెట్రోల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం భారత్‌పై వుంటుందని జైట్లీ తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ప్రకారం.. పెట్రోల్ ధరల్లో మార్పులు తప్పవని జైట్లీ చెప్పారు. క్రూడాయిల్ ధరలు ఏ వైపునకు సాగుతాయో అంచనా వేసే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రాలు విధిస్తున్న సుంకాలను తగ్గిస్తే ప్రజలకు ఊరట లభిస్తుందని తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్‌తో సమావేశమైన అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడుతూ.. పరపతి విధాన సమీక్షలు దేశాభివృద్ధికి తోడ్పడేలా వుండాలని.. అంతేకానీ రోజు రోజుకీ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని విధానాలను మార్పుచుకుంటూ పోకూడదని సూచించారు.