Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డ్రీమ్‌హాక్ ఇండియా యొక్క 4వ ఎడిషన్‌ను ప్రకటించిన NODWIN గేమింగ్

Advertiesment
image
, బుధవారం, 6 సెప్టెంబరు 2023 (22:30 IST)
భారతదేశానికి ఇష్టమైన డిజిటల్ ఫెస్టివల్, డ్రీమ్‌హాక్, దాని నాల్గవ ఎడిషన్ కోసం నిజాం నగరమైన హైదరాబాద్‌కు విజయవంతంగా తిరిగి వస్తోంది. పరిశ్రమ-ప్రముఖ గేమింగ్, ఈ స్పోర్ట్స్ మీడియా కంపెనీ, NODWIN గేమింగ్, గ్లోబల్ ఈ స్పోర్ట్స్ గోలియత్ ESL FaceIt గ్రూప్‌తో కలిసి డ్రీమ్‌హాక్ ఇండియా యొక్క నాల్గవ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ఉత్తేజకరమైన యాక్షన్, అత్యాధునిక సాంకేతికత, స్పోర్ట్స్ అద్భుతాలు, గేమింగ్, పాప్ సంస్కృతి యొక్క ఉత్సాహభరితమైన వేడుకలతో నిండిన మూడు రోజుల థ్రిల్లింగ్ దృశ్యం కోసం నవంబర్ 3న మీ క్యాలెండర్‌లపై మార్క్ చేసుకొండి. డ్రీమ్‌హాక్ ఇండియా 2023 టిక్కెట్‌లను ఇప్పుడు టికెటింగ్ భాగస్వాములు, PayTM ఇన్‌సైడర్, MeraEvents ద్వారా పొందవచ్చని NODWIN గేమింగ్  వెల్లడించింది.
 
NODWIN గేమింగ్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అక్షత్ రాథీ మాట్లాడుతూ, “డ్రీమ్‌హాక్ ఇండియా 2023 టిక్కెట్‌లు అందుబాటులో ఉన్నాయి. డ్రీమ్‌హాక్ యొక్క ఈ సంవత్సరపు ఎడిషన్ మా ఉద్వేగభరితమైన కమ్యూనిటీకి అనేక ఆశ్చర్యాలను కలిగిస్తుంది. నవంబర్‌లో, హైదరాబాద్ అసమానమైన అనుభూతికి అంతిమ గమ్యస్థానం అవుతుంది!” అని అన్నారు. డ్రీమ్‌హాక్ యొక్క గ్లోబల్ లీనేజీని అనుసరించి డ్రీమ్‌హాక్ ఇండియా యొక్క 4వ ఎడిషన్ కూడా BYOD (బ్రింగ్ యువర్ ఓన్ డివైస్) జోన్‌లను అందించడానికి సిద్ధంగా ఉంది, ఇక్కడ టెక్కీలు తమ సొంత సిస్టమ్‌లను ఫెస్టివల్‌లో ప్రదర్శించవచ్చు. 
 
NODWIN గేమింగ్ ఈ సంవత్సరం డ్రీమ్‌హాక్ ఇండియా 2023 కోసం కొత్త ఫీచర్-లాడెన్ టికెటింగ్ ఫార్మాట్‌ను కూడా ప్రకటించింది. డ్రీమ్‌హ్యాక్ రెగ్యులర్ గేమింగ్ అవసరాలను తీర్చడానికి క్యూరేటెడ్ 'ఎపిక్ గేమర్' ఫెస్టివల్ పాస్‌ల నుండి, మొదటి సారి డ్రీమ్‌హాక్‌కు సరిపోయేలా డే పాస్‌ల వరకు అందుబాటులో ఉంటాయి. భారతదేశం యొక్క ప్రీమియర్ డిజిటల్ పండుగగా, అనేక రకాల ఎంపికలను డ్రీమ్‌హాక్ అందిస్తుంది. ప్రత్యేకమైన 'ఫ్యాన్ పాస్‌లు' మీట్-అండ్-గ్రీట్ జోన్‌లకు యాక్సెస్‌ను అందిస్తాయి, అభిమానులు తమ ఇష్టమైనఈ స్పోర్ట్స్ అథ్లెట్లు మరియు కంటెంట్ క్రియేటర్‌లతో సన్నిహితంగా కనెక్ట్ అవ్వడానికి ఇవి వీలు కల్పిస్తాయి. పోటీ థ్రిల్‌లను కోరుకునే వారికి, 'గేమర్ పాస్‌లు' ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డ్రీమ్‌హాక్  పోటీలలో మునిగిపోయే అవకాశాన్ని అందిస్తుంది. అక్టోబర్ 3 నుంచి డే పాస్‌లు కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. డ్రీమ్‌హాక్ ఇండియాకు గతంలో హాజరైన వారు డ్రీమ్‌హ్యాక్ ఇండియా 2023 కోసం తమ టిక్కెట్‌లను కొనుగోలు చేసేటప్పుడు ప్రత్యేక తగ్గింపుల ప్రయోజనాన్ని పొందగలరు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమపెళ్లికి శివుడు కనికరించలేదు.. అంతే శివలింగాన్ని దాచేశాడు..