Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్యాంకు ఎటీఎంలు వద్దేవద్దు.. పోస్టల్ ఏటీఎంలే ముద్దు.. ఎన్ని సార్లు విత్‌డ్రా చేసినా నో చార్జీ

ఖాతాదారులను పీక్కు తింటున్న బ్యాంకుల సేవలను ఇక వదిలించుకునే బంపర్ ఆఫర్ జనం ముందుకు వచ్చేసింది. పైసా చార్జీ చెల్లించనవసరం లేకుండా వినియోగదారులకు ఉచిత సేవలందించే గొప్ప అవకాశాన్ని దేశం మొత్తం మీద ఒక్క పోస్టల్ విభాగమే అందిస్తోంది. దేశం ఖర్మగాలి బ్యాంకుల

Advertiesment
Postal bank
హైదరాబాద్ , శనివారం, 22 జులై 2017 (02:07 IST)
ఖాతాదారులను పీక్కు తింటున్న బ్యాంకుల సేవలను ఇక వదిలించుకునే బంపర్ ఆఫర్ జనం ముందుకు వచ్చేసింది. పైసా చార్జీ చెల్లించనవసరం లేకుండా వినియోగదారులకు ఉచిత సేవలందించే గొప్ప అవకాశాన్ని దేశం మొత్తం మీద ఒక్క పోస్టల్ విభాగమే అందిస్తోంది. దేశం ఖర్మగాలి బ్యాంకుల బారిన పడింది గానీ పోస్టల్ శాఖను, పోస్టాఫీసును నమ్ముకుంటే ఇక ఏ చార్జీల జోలికి పోకుండా అన్ని సేవలూ పొందవచ్చు. మీరు పెట్టే డిపాజిట్లకు కూడా పైసా వసూలు చేయకుండా అసలు, వడ్డీ రెండూ గ్యారంటీగా అందించే ఏకైక సంస్థ ప్రపంచంలోనే భారతీయ పోస్టల్ సంస్థ. కానీ దానిపై మనం చిన్నచూపు చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా పోస్టల్ విభాగం అందించే గొప్ప సేవ పోస్టల్ ఏటీఎంలు. ఎన్నిసార్లు వాడుకున్నా, నయా పైసా చార్జీ విధించకుండా డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం పోస్టల్ ఎటీఎంలలోనే లభిస్తోంది. ఇప్పుడు ఈ పోస్టల్ ఏటీంలు పరిమితంగా ఉన్నాయి కానీ రానురాను జనంకు మేలు చేసే ఒకే ఒక్క ప్రజా సంస్థ పోస్టల్ విభాగమే. 
 
పోస్టల్‌ ఏటీఎం విత్‌ డ్రాలపై సర్వీస్‌ చార్జీ లేదని, ఎన్ని పర్యాయాలైనా డబ్బులు విత్‌ డ్రా చేసుకునే వెసులుబాటు ఉందని తెలంగాణ తంతి తపాలా సర్కిల్‌ సంచాలకులు వీవీ సత్యనారాయణ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోస్టల్‌ ఏటీఎంల్లో అన్ని బ్యాంకుల ఏటీఎం కార్డులు పనిచేస్తాయని, ఇతర బ్యాంకు ఏటీఎంల మాదిరిగా మూడు విత్‌డ్రాలు దాటగానే సర్వీస్‌ చార్జీ పడదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 ఏటీఎంల్లో ఎనీ టైం నగదు అందుబాటులో ఉంటుందని వివరించారు. పోస్టాఫీసుల్లో రూ.50తో సేవింగ్‌ ఖాతా తెరవచ్చన్నారు. పోస్టల్‌ బ్యాంక్‌ ఖాతాలకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు.
 
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు పోస్టాఫీసుల ద్వారానే అందిస్తున్నామని చెప్పారు. హన్మకొండ, మహబూబ్‌నగర్‌లో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ప్రారంభించామని, భవిష్యత్తులో మరిన్ని చోట్ల విస్తరిస్తామన్నారు. ఆధార్‌ అప్‌డేట్, ఎన్‌రోల్‌ మెంట్‌ కేంద్రాలను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. పోస్టల్‌ శాఖ జీవిత, ప్రమాద బీమా, పెన్షన్, బాలికల, సీనియర్‌ సిటిజన్‌ తదితర పథకాలను అమలు చేస్తోందన్నారు. పోస్టాఫీసులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోయిడాలో వీధికుక్కను కాలితో తొక్కి చంపిన ట్రాఫిక్ పోలీస్.. ఫోటో వైరల్