Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుక్రవారం నుంచి అందుబాటులోకి ఏటీఎంలు ప్లస్.. కొత్త రూ.500, రూ.2వేల నోట్లు

శుక్రవారం నుంటి ఏటీఎంలు తెరుచుకోనున్నాయి. రూ.500, రూ.1000ల నోట్ల రద్దుతో బుధ, గురువారాలు మూతపడిన ఏటీఎంలు.. 11వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో పనిచేస్తాయని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి అశోక్‌ లావాసా తెలిపారు

Advertiesment
New currency notes in ATMs from Friday: Government
, గురువారం, 10 నవంబరు 2016 (09:31 IST)
శుక్రవారం నుంటి ఏటీఎంలు తెరుచుకోనున్నాయి. రూ.500, రూ.1000ల నోట్ల రద్దుతో బుధ, గురువారాలు మూతపడిన ఏటీఎంలు.. 11వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో పనిచేస్తాయని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి అశోక్‌ లావాసా తెలిపారు. అదే రోజు నుంచి కొత్తగా ముద్రించిన రూ.500, రూ.2 వేల నోట్లు ఏటీఎంల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
 
అయితే కొద్దిరోజుల పాటు వినియోగదారులు రోజుకి రూ.2 వేలు మాత్రమే ఏటీఎం నుంచి డ్రా చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇంకా వారానికి గరిష్ఠంగా రూ.20వేలు మాత్రమే ఏటీఎంల నుంచి పొందే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. వంద నోట్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా అన్ని బ్రాంచీల్లో, ఏటీఎంల్లో రానున్న రూ.100 నోట్లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచనున్నట్లు ఎస్బీఐ ఎండీ రజనీష్ కుమార్ ప్రకటన చేశారు.
 
ఇదిలా ఉంటే.. అంతరిక్ష పరిశోధనలలో అద్భుత విజయాలు సాధిస్తూ దేశానికే గర్వకారణంగా నిలుస్తున్న ఇస్రోకు సముచిత గౌరవం లభించింది. కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2వేల కరెన్సీ నోటుపై మంగళ్‌యాన్‌కు స్థానం కల్పించింది. కరెన్సీ నోటుపై ఇస్రోకు స్థానం కల్పించడం ఇది మూడోసారి. బుడిబుడి అడుగులు వేస్తున్న రోజుల్లో తొలి ఉపగ్రహం ఆర్యభట్టను రోదసిలోకి పంపినందుకు.. రెండు రూపాయల కరెన్సీ నోటుపై ఆర్యభట్ట ఉపగ్రహాన్ని గతంలో ముద్రించారు. 
 
కొద్దిరోజులకే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని వేయిరూపాయల నోటుపై ముద్రించింది. ఆపై రెండు దశాబ్దాల తర్వాత 2వేల రూపాయల నోటుపై మామ్‌ ఉపగ్రహాన్ని ముద్రించింది. తాజాగా మంగళయాన్‌కు రూ.2వేల కరెన్సీ నోటుపై స్థానం కల్పించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు అనంతపురం పవన్‌ కళ్యాణ్ ప్రత్యేక గర్జన.. బహిరంగ సభకు భారీ బందోబస్తు