టాటా నెక్సన్ స్పోర్ట్స్ కార్... రూ. 5.85 లక్షలు నుంచి రూ. 9.45 లక్షల వరకూ...
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కొత్త కాంపాక్ట్ ఎస్‌యువి నెక్సన్‌ను దసరా పండుగ సందర్భంగా శుక్రవారం నాడు మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కారు ధర రూ. 5.85 లక్షలు నుంచి రూ. 9.45 లక్షల వరకూ వుంటుందని కంపెనీ అధికారులు ప్రకటించారు. ఈ తరహా కార్లతో
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కొత్త కాంపాక్ట్ ఎస్‌యువి నెక్సన్‌ను దసరా పండుగ సందర్భంగా శుక్రవారం నాడు మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కారు ధర రూ. 5.85 లక్షలు నుంచి రూ. 9.45 లక్షల వరకూ వుంటుందని కంపెనీ అధికారులు ప్రకటించారు. ఈ తరహా కార్లతో పోల్చి చూసినప్పుడు టాటా నెక్సన్ కారు ధర కనీసం రూ. లక్ష తక్కువగా వుంటుందనీ, కానీ సౌకర్యాల విషయంలో మాత్రం ఇతర కార్ల కంటే మెరుగ్గా వుంటుందని తెలిపారు.
రివోట్రాన్ సీరీస్‌కు చెందిన 1.2 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్, రివోటార్క్ సీరీస్‌కు చెందిన 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లతో కూడిన ఈ ఎస్‌యువి కార్లు వినియోగదార్లను అమితంగా ఆకట్టుకుంటాయని అన్నారు. ఆకర్షణీయమైన డిజైన్‌తో టాటా మోటార్స్ మార్కెట్‌లోకి తెచ్చిన నాలుగో వాహనం ఇది. మరి ఈ కారు ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాల్సి వుంది.