Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్డీటీవీ యూనికార్న్ అవార్డును సొంతం చేసుకున్న నెట్‌మెడ్స్

దేశంలో ఉన్న ప్రముఖ ఈ-ఫార్మా కంపెనీల్లో ఒకటైన నెట్‌మెడ్స్‌ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్డీటీవీ స్టార్ట్‌అప్ అవార్డును సొంతం చేసుకుంది. ఇది దేశంలో హెల్త్‌కేర్ ఆన్‌లైన్ మార్కెటింగ్ రంగంలో నెట్‌మెండ్స్ డాట్

Advertiesment
Netmeds
, శుక్రవారం, 5 ఆగస్టు 2016 (17:56 IST)
దేశంలో ఉన్న ప్రముఖ ఈ-ఫార్మా కంపెనీల్లో ఒకటైన నెట్‌మెడ్స్‌ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్డీటీవీ స్టార్ట్‌అప్ అవార్డును సొంతం చేసుకుంది. ఇది దేశంలో హెల్త్‌కేర్ ఆన్‌లైన్ మార్కెటింగ్ రంగంలో నెట్‌మెండ్స్ డాట్ కామ్ పేరుతో వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తోంది. స్టార్ట్-అప్స్ ఇండియాలో భాగంగా ఎన్డీటీవీ ఈ అవార్డును ప్రవేశపెట్టిగా, ఇయర్ ఆఫ్ ది అవార్డుగా ఈ-ఫార్మా కంపెనీ కైవసం చేసుకుంది.
 
గత నెల 29వ తేదీన తాజ్ ప్యాలెస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ టీవీ వ్యాఖ్యాత మందిరాబేడీ, టెక్ గురు రాజీవ్ మఖ్నీ, ఎన్డీటీవీ సీఈఓ విక్రమ్ చంద్రాల సమక్షంలో ఈ అవార్డును నెట్‌మెడ్‌ సంస్థకు అందజేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్, లైమ్‌రోడ్ ఫౌండర్, సీఈఓ సుచి ముఖర్జీ, క్వాట్రో సీఈఓ రామన్ రాయ్, నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్‌లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి నెట్‌మెడ్‌ను ఈ అవార్డు కోసం ఎంపిక చేశారు. 
 
ఇదే అంశంపై ఆ కంపెనీ సీఈవో ప్రదీప్ దాధా మాట్లాడుతూ, ప్రతి అవార్డు ఎంతో మనోహరమైనదే. అయితే, ఎన్డీటీవీ యూనికార్న్ అవార్డు ప్రతి వ్యాపారవేత్తకు సరికొత్త గుర్తింపును తెచ్చిపెడుతుందన్నారు. తమ వ్యాపారం ప్రారంభించిన తొలి యేడాది ఎన్నో క్లిష్టపరిస్థితులను ఎదుర్కొన్నట్టు చెప్పారు. మరసటి యేడాది నుంచి వాటిని మెల్లగా అధికమిస్తూ ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు అనేక రకాలైన చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారని కొనియాడారు.
 
కాగా, నెట్‌మెడ్స్ ఈ-ఫార్మా పోర్టల్ కేంద్రంగా దేశ వ్యాప్తంగా 35 వేల ప్రిస్కిప్షన్ డ్రగ్స్‌ను వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. అలాగే, ప్రిస్కిప్షన్ లేకుండా లైఫ్‌స్టైల్ డ్రగ్స్‌ విభాగంలో పర్సనల్ కేర్, వెల్‌నెస్, హెల్త్ మందులను విక్రయిస్తున్నట్టు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యను చంపేశాడు.. శవంపై పరుపు పేర్చి.. ప్రేయసితో ఉల్లాసంగా గడిపాడు!