చెన్నై: ప్లాస్టిక్ ప్రాసెసింగ్ పరిశ్రమ కోసం వినూత్న పరిష్కారాలను అందించటంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన మోటాన్ గ్రూప్, భారతదేశంలోని చెన్నైలో తమ అత్యాధునిక సౌకర్యం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ వ్యూహాత్మక విస్తరణ భారతీయ ప్లాస్టిక్ రంగం యొక్క పెరుగుతున్న డిమాండ్లను తీర్చడంలో మోటాన్ యొక్క అంకితభావాన్ని నొక్కి చెబుతుంది.
నూతనంగా ప్రారంభించిన ఈ సౌకర్యం 2 మిలియన్ యూరోలు(సుమారు రూ.17 కోట్లు) పెట్టుబడిని సూచిస్తుంది, ఇది భారత మార్కెట్ సామర్థ్యంపై మోటాన్ యొక్క విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. మూడు ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న 20,000 చదరపు అడుగుల నిర్మాణం పరిశోధన, అభివృద్ధి, పంపిణీకి కేంద్రంగా పనిచేయనుంది. ఈ కార్యక్రమం, భారతీయ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా అధిక-నాణ్యత కలిగిన ఉత్పత్తులు, సేవలను అందించే మోటాన్ సామర్థ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
మోటాన్ గ్రూప్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి ఫుల్సాక్ సాండ్రా, కంపెనీ యొక్క ప్రపంచ లక్ష్యం నొక్కి చెబుతూ: "1947లో కాన్స్టాన్స్ సరస్సు ఒడ్డున స్థాపించబడిన మోటాన్, ప్లాస్టిక్ పరిశ్రమలో ప్రాసెస్ పెరిఫెరల్స్ కోసం ప్రముఖ భాగస్వామిగా అభివృద్ధి చెందింది, ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలలో కార్యకలాపాలను నిర్వహిస్తుంది " అని అన్నారు.
మోటాన్ గ్రూప్ యొక్క చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీ కార్ల్ లిథర్లాండ్, భారత మార్కెట్ యొక్క ప్రాముఖ్యతను వెల్లడిస్తూ,"భారతదేశం మాకు అతి పెద్ద మార్కెట్‌గా నిలువనుంది. మేము చాలా కాలంగా భారతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాము. ఈ సౌకర్యం ప్రారంభం ఇక్కడ మా కార్యకలాపాలను విస్తరించటంలో కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది" అని అన్నారు. మోటాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ ఆనందకుమార్ రామచంద్రన్ విస్తరణ గురించి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ: "ఈ సౌకర్యం మా వృద్ధి పథంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. భారత మార్కెట్ పట్ల మా అచంచలమైన నిబద్ధతను ప్రదర్శిస్తుంది" అని అన్నారు.
మోటాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీమతి విద్యా రమేష్, సంస్థ ఉత్పత్తి శ్రేణి గురించి వివరించారు. ఆమె మాట్లాడుతూ, "నిల్వ, రవాణా, డ్రైయింగ్, డోసింగ్ మరియు మిక్సింగ్ నుండి నియంత్రణ వరకు ప్రాసెస్ చైన్ లోని ప్రతి దశకు సమగ్రమైన అనుకూలీకరించిన భాగాలను మోటాన్ అందిస్తుంది. మా ఉత్పత్తులు సరళమైన, సహజమైన భాగాల నుండి సంక్లిష్టమైన, కేంద్రీకృత నియంత్రిత వ్యవస్థల వరకు విభిన్న కస్టమర్ అవసరాలను తీర్చడానికి రూపొందించబడ్డాయి" అని అన్నారు.
భారతదేశంలో మోటాన్ నినాదం, " భారతీయ అభిరుచిని తీర్చనున్న జర్మన్ ఇంజనీరింగ్". భారతీయ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ పరిశ్రమ యొక్క శక్తివంతమైన వృద్ధి, అధునాతన జర్మన్ సాంకేతికతను అనుసంధానించాలనే కంపెనీ లక్ష్యంను ఇది ఒడిసి పడుతుంది. ప్రపంచంలోని అత్యంత ఆశాజనకమైన మార్కెట్లలో ఒకదానిలో అధిక-నాణ్యత ఉత్పత్తులు, సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చాలనే మోటాన్ లక్ష్యంతో ఈ విస్తరణ వ్యూహాత్మకంగా అనుసంధానించబడి ఉంది.