Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయ్ మాల్యాలా విదేశాలకు పారిపోకండి.. దేశానికి తిరిగిరండి: ఢిల్లీ హైకోర్టు

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాతో మొయిన్ ఖురేషికి లింకుపెట్టింది... ఢిల్లీ హైకోర్టు. ఇమిగ్రేషన్ అధికారులకు చుక్కలు చూపించి దుబాయ్‌కి చక్కేసిన మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషి కేసుపై ఢిల్లీ హైకోర్టు విచారించింద

Advertiesment
విజయ్ మాల్యాలా విదేశాలకు పారిపోకండి.. దేశానికి తిరిగిరండి: ఢిల్లీ హైకోర్టు
, గురువారం, 27 అక్టోబరు 2016 (15:31 IST)
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాతో మొయిన్ ఖురేషికి లింకుపెట్టింది... ఢిల్లీ హైకోర్టు. ఇమిగ్రేషన్ అధికారులకు చుక్కలు చూపించి దుబాయ్‌కి చక్కేసిన మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషి కేసుపై ఢిల్లీ హైకోర్టు విచారించింది. విజయ్ మాల్యాలాగా విదేశాలకు పారిపోయి తిరిగిరాకుండా ఉండొద్దని వ్యాఖ్యానించింది.

మీరు భారత్‌లో లేరంటే దాని అర్థం కోర్టుకు హాజరు కావాలనుకుకోవట్లేదని తెలుస్తోందని కోర్టు పేర్కొంది. ముందు దేశానికి వచ్చి ఆపై ఇంటరాగేషన్‌లో పాల్గొనండి అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనను అరెస్టు చేయకుండా ఉత్తర్వులివ్వాలన్న ఖురేషీ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. 
 
ఇదిలా ఉంటే.. లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యాకు చెందిన కార్పొరేట్‌ జెట్‌ విమానాన్ని నవంబరులో వేలం వేసేందుకు రంగం సిద్ధమైంది. సర్వీస్‌ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు బకాయిపడిన రూ.535 కోట్లు వసూలు చేసుకోవడానికి ఈ చర్య తీసుకోనున్నారు. ఈ మేరకు కార్పొరేట్‌ జెట్‌ ఎయిర్‌బస్‌ ఎ319 విమానం విక్రయానికి ఆన్‌లైన్‌ బిడ్‌లు ఆహ్వానించింది. అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే నవంబర్‌ 28-29న ఈ జెట్ విమానానికి వేలం నిర్వహించే ఛాన్సున్నట్లు తెలుస్తోంది. 
 
17బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేసిన విజయ్‌మాల్యా దేశం విడిచి బ్రిటన్‌కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. మాల్యా రూ.535 కోట్లు చెల్లించాలని సేవాపన్నుల విభాగం ఇప్పటికే ముంబయి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శేషాచలంలో మళ్లీ మంటలు.. కారణం ఎవరు..?