సామాన్య ప్రజలకు ఇప్పుడే పెట్రోల్ బాదుడు తప్పలేదు. మరోవైపు సిలిండర్ రేట్లతో షాక్ తప్పలేదు. పెరిగన ధరలతో సామాన్యుల జేబులకు చిల్లు పడుతుంటే.. చమురు కంపెనీలు ఒక్కసారిగా వంట గ్యాస్ ధరలు పెంచేశాయి.
గ్యాస్ సిలిండర్‌పై 25 రూపాయలు పెంచగా.. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి. పెరిగిన ధరతో ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర 794 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్‌లో 846 రూపాయలకు చేరుకుంది. ఫిబ్రవరిలో మొత్తంగా మూడు సార్లు గ్యాస్ ధరలు పెరిగాయి.
ఫిబ్రవరి 4న 25 రూపాయలు..15న మరో 50 రూపాయలు పెంచిన చమురు కంపెనీలు ఇప్పుడు మరో 25 రూపాయలు పెంచడంతో ఈ ఒక్క నెలలోనే 100 రూపాయలు పెంచినట్లయింది. పెరిగిన ధరలతో సామాన్యుడిపై అదనపు భారం పడుతోంది. ఒకప్పుడు 600 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు 850 రూపాయలకు చేరుకుంది.