ఎల్‌పీజీ గ్యాస్ ధరలు తరచుగా మారుతూ వస్తున్నాయి. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెంచేశాయి ఆయిల్
మార్కెటింగ్ కంపెనీలు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ భారీగా వినియోగించే వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటల్లు, చిన్న పరిశ్రమలు ఈ ధరలు పెను భారంగా మారనున్నాయి.
19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ ధరలు ఏకంగా రూ.39 పెంచేశాయి. 2024 సెప్టెంబర్ 1వ తేదీన 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.39 పెంచేశాయి.
దీంతో ఢిల్లీలో ఎల్‌పీజీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు రూ.1691.50. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్లో రూ.855, విశాఖపట్నంలో రూ.812 ఉన్నాయి.