కువైట్ సర్కారు సంచలన నిర్ణయం : నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
కువైట్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో దేశంలోని ప్రతి పౌరుడికి నెలకు 75 లీటర్ల పెట్రోల్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల ఆ దేశ ప్రజలు హర్షం
కువైట్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో దేశంలోని ప్రతి పౌరుడికి నెలకు 75 లీటర్ల పెట్రోల్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల ఆ దేశ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
గత నెల నుంచి పెట్రోల్ రేట్లను దాదాపు 30 శాతం పెంచిన విషయంతెలిసిందే. అంతేకాకుండా దేశ పౌరులకు ఇచ్చే సబ్సిడీని కూడా రద్దు చేశారు. దీంతో దేశ పౌరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆర్థికంగా నష్టాల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించి, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలనే సదుద్ధేశంతోనే ఈ విధమైన చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ.. నిరసనలు ఆగలేదు.
వీటిని చల్లార్చేందుకు నిమిత్తం.. ప్రతీ కువైట్ పౌరుడికి నెలకు 75 లీటర్ల పెట్రోల్‌ను ఉచితంగా అందిస్తామని నేషనల్ అసెంబ్లీ స్పీకర్ మార్జోక్ అల్ ఘనీమ్ ప్రకటించారు. అయితే దేశ ప్రజల సంక్షేమం దృష్ట్యా, వారి నుంచి వస్తున్న విన్నపాలను దృష్టిలో పెట్టుకుని నెలకు 75 లీటర్ల పెట్రోలును ఉచితంగా ఇస్తామని ఆయన ప్రకటించారు.
ప్రతీ కువైట్ పౌరుడు నెలకు 240 లీటర్లు పెట్రోలు వాడుతున్నట్లు అధికారుల అంచనా. పెరిగిన పెట్రోలు ధరలతో సెప్టెంబర్ 1 నుంచి లీటర్ ఆక్టేన్ 91.. 60 ఫిల్స్ నుంచి 85 ఫిల్స్‌కు చేరగా, ఆక్టేన్ 95.. 65 ఫిల్స్ నుంచి 105 ఫిల్స్‌కు చేరింది. ఆల్ట్రా ప్రీమియమ్ 90 ఫిల్స్ నుంచి 165 ఫిల్స్‌కు చేరింది.