క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, భారతదేశంలోని 20 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రకృతితో పాటు వారి ప్రధాన పంట బీమా పథకం సుకృతిని ఈరోజు ప్రకటించింది. రుతుపవనాల రాకతో అన్ని ముఖ్యమైన ఖరీఫ్ పంటలు విత్తే కాలం మొదలవుతున్నందున ఇప్పుడు, భారతదేశ జిడిపికి దాదాపు 15% తోడ్పడే కోట్లాది మంది రైతులు, తమ పంటలను రక్షించుకోగలరు.
క్షేమ సుకృతి యొక్క విస్తృత పరిధి రైతులకు మరియు వారి కుటుంబ సభ్యులు బీమా చేయదగిన ఆదాయాలు ఉన్నవారు ఉచితంగా నమోదు చేసుకోవచ్చు మరియు తమ పంటలను రక్షించుకోవడానికి పంట బీమా పాలసీని ఎకరాకు రూ. 499కి మాత్రమే కొనుగోలు చేయగలరు. రైతులు సుకృతిని కొనుగోలు చేయడానికి క్షేమ యాప్ లోకి లాగిన్ చేయవచ్చు, ఇది భారతదేశంలోని మొట్టమొదటి మరియు ఏకైక కస్టమైజ్ చేయదగిన పంట బీమా పథకం. సుకృతి రైతులకు ముందుగా నిర్ణయించిన తొమ్మిది ప్రమాదాల జాబితా నుండి ఒక పెద్ద మరియు ఒక చిన్న ప్రమాదాల కలయికను ఎంచుకునే అవకాశాన్ని ఇస్తుంది. వాతావరణం, ప్రాంతం, వారి పొలం యొక్క స్థానం, చారిత్రక నమూనా మొదలైన వాటి ఆధారంగా వారి పంటను ఎక్కువగా ప్రభావితం చేసే ప్రమాదాల కలయికను రైతులు ఎంచుకోడానికి అవకాశాన్ని ఇస్తుంది. తుఫాను, ఉప్పెన (హైడ్రోఫిలిక్ పంటలకు వర్తించదు), వరదలు, వడగళ్ల వాన, భూకంపం, కొండచరియలు విరిగిపడడం, మెరుపుల కారణంగా మంటలు, జంతువుల దాడి (కోతి, కుందేలు, అడవి పంది, ఏనుగు) మరియు విమానాల వల్ల కలిగే నష్టాలు వంటి ప్రమాదాలు కవర్ చేయబడ్డాయి.
యాప్‌ని ఉపయోగించి సుకృతిని కొనుగోలు చేయడం ద్వారా రైతులు, బీమా చేయదగిన ఆదాయం ఉన్న వారి కుటుంబ సభ్యులు 100కు పైగా కాలానుగుణ పంటలను రక్షించుకోవచ్చు కాబట్టి సుకృతి ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా ఉంది. సుకృతి ఏ ఇతర బీమా పథకం లేదా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కంటే ఎక్కువ పంటలను కవర్ చేస్తుంది. సుకృతిని కొనుగోలు చేసేటప్పుడు రైతులు తమ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా బీమా మొత్తాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా, క్షేమ బీమాను కొనుగోలు చేయడం నుండి యాప్‌లో క్లెయిమ్‌లను సమర్పించడం వరకు వినియోగదారుల ప్రయాణాన్ని చాలా సులువుగా చేసింది.