కేంద్ర ఆర్థిక శాఖ ప్రవేశపెట్టిన కళ్యాణ్ సెస్ జూన్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. ఫలితంగా ఫోన్, హోటల్ బిల్లులు మరింత ప్రియం కానున్నాయి. వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ఈ పన్నును వసూలు చేయనంది.
ప్రస్తుతం స్వచ్ఛ భారత సెస్‌తో కలిపి సర్వీస్ టాక్స్ 14.5 శాతంగా ఉంది. జూన్ ఒకటో తేదీ నుంచి కృషి కల్యాణ్ సెస్ పేరుతో ప్రభుత్వం మరో అర శాతం సెస్ వసూలు చేయనున్నారు. దీంతో ఫోన్ బిల్లులు, హోటల్ బిల్లులు, సినిమా టిక్కెట్లు, ఆరోగ్య సేవలు, బ్యాంకింగ్ లావాదేవీలు, రైలు, విమాన టిక్కెట్లు, బీమా పాలసీలు, ప్రైవేటు ట్యూషన్స్, కోచింగ్ సెంటర్లు మరింత భారం కానున్నాయి.
బ్యాంకు సేవలైన డిమాండ్ డ్రాఫ్ట్స్, లాకర్లు, కొత్త చెక్కు బుక్కుల జారీకి కూడా ఈ పన్నును వసూలు చేస్తారు. వ్యవసాయ అభిృవృద్ధి, రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 'కృషి కల్యాణ్ సెస్' ప్రవేశపెడుతోంది.