భారత్‌లో కియా రాణిస్తోంది. కేవలం రెండున్నరేళ్లలోనే ఏకంగా 5 లక్షల కార్లను ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పింది.ఏపీలోని అనంతపురం జిల్లా పెనుగొండ ఫ్లాంట్‌లో ఇప్పటిదాకా 5 లక్షల కార్లను ఉత్పత్తి చేశామని, వీటిలో ఏకంగా 4 లక్షల కార్లను భారత్‌లోనే విక్రయించామని కియా ఓ ప్రకటనలో తెలిపింది. 
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	మరో లక్ష కార్లను విదేశాలకు ఎగుమతి చేసినట్టుగా కియా వెల్లడించింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో తమ వాటా 25 శాతానికి పెరిగిందని, ఈ మార్కును తాము కేవలం రెండున్నరేళ్ల వ్యవధిలోనే సాధించామని కియా వెల్లడించింది. 
	 
	కియా భారతదేశం నుండి యుటిలిటీ వాహనాల (యువిలు) యొక్క అగ్ర ఎగుమతిదారుగా కూడా పేర్కొంది. 2021లో మార్కెట్ వాటా 25% పైగా ఉంది. ఈ నెల ప్రారంభంలో, కియా కారెన్స్‌ను ప్రారంభించింది - ఇది భారతదేశం కోసం తన నాల్గవ మోడల్. ఇది ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయబడుతుంది.