Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మలేని రాష్ట్రంలో 50 శాతం లంచం అడిగిన అన్నాడీఎంకే మంత్రులు.. ఏపీకెళ్లిన 'కియా'

జయలలిత... ఈ పేరు ఇటు పార్టీలోనేకాకుండా, అటు దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఓ సింహస్వప్నం. ఈ పేరు ఉచ్ఛరించేందుకు ఏ ఒక్క రాజకీయనేత సైతం సహసం చేయరు. పైగా, కాలు బయటపెట్టకుండానే కోట్లాది రూపాయల విదేశీ పెట్టుబడుల

అమ్మలేని రాష్ట్రంలో 50 శాతం లంచం అడిగిన అన్నాడీఎంకే మంత్రులు.. ఏపీకెళ్లిన 'కియా'
, గురువారం, 11 మే 2017 (13:57 IST)
జయలలిత... ఈ పేరు ఇటు పార్టీలోనేకాకుండా, అటు దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఓ సింహస్వప్నం. ఈ పేరు ఉచ్ఛరించేందుకు ఏ ఒక్క రాజకీయనేత సైతం సహసం చేయరు. పైగా, కాలు బయటపెట్టకుండానే కోట్లాది రూపాయల విదేశీ పెట్టుబడులను ఆకర్షించిన మహిళా ముఖ్యమంత్రి. అలాంటి ఆమె లేని రాష్ట్రంలో ఆమె పార్టీ అన్నాడీఎంకేకి చెందిన మంత్రులు అవినీతిఊబిలో కూరుకుని పోయారు. ఒక ఫ్యాక్టరీ పెట్టేందుకు ఎవరైనా మందుకు వస్తే.. ప్రాజెక్టుకయ్యే స్థలంలో 50 శాతం లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. దీంతో విదేశీ పెట్టుబడిదారులు ఇతర పొరుగు రాష్ట్రాలకు పారిపోతున్నారుట. తాజాగా జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 
 
కొరియాకు చెందిన కియా మోటార్స్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ప్రస్తుతం తమిళనాడులో ఒకటి ఉంది. రెండో ప్లాంట్‌ను అక్కడే పెట్టాలని ఆ సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. చివరికి పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంది. దీనికి కారణం తమిళనాడు మంత్రులే కారణం. కియా సంస్థ ఏపీకి తరలివెళ్లడానికి వెనుక మంత్రులు డిమాండ్ చేసిన అమ్యామ్యాలే కారణమన్న వాదన బలంగా వినిపిస్తోంది. 
 
చెన్నైకి సమీపంలోని ఓరగడంలో స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడుకు చెందిన స్థలం అందుబాటులో ఉండగా, దాన్ని కియాకు ఇచ్చేందుకు నిర్ణయించుకున్న తమిళనాడు మంత్రులు, ప్రాజెక్టుకయ్యే స్థలంలో 50 శాతం లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారట. దీంతో కియా యాజమాన్యం ఏపీకి వెళ్లిపోయిందని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ పారిశ్రామికవేత్త వెల్లడించారు. 
 
అయితే, ఈ విమర్శలను ఆ రాష్ట్ర మంత్రి ఎంసీ సంపత్ ఖండించారు. ఒకే రాష్ట్రంలో రెండు ప్లాంటులు ఉండరాదన్న విధానంతోనే కొరియా సంస్థ ఏపీని ఎంచుకుందని వెల్లడించారు. లంచాలు అడిగామనడాన్ని తప్పుబట్టారు. నిజానికి కియాకు ఆగస్టు 2016లో 400 ఎకరాల భూమిని తమిళ సర్కారు ఆఫర్ చేసింది. ఇక్కడే రెండో యూనిట్ మొదలవుతుందని భావించినా, జయలలిత మరణం తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో కియా ఏపీని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిషిత్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడని తెలియదు.. అందుకే ఈ విషాదం : మంత్రి నారాయణ