Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సన్‌ఫీస్ట్ మేరీ లైట్ కొత్త బ్రాండ్ అంబాసిడర్ జ్యోతిక

Advertiesment
image
, బుధవారం, 4 అక్టోబరు 2023 (19:48 IST)
ఐటిసీలో భాగమైన సన్‌ఫీస్ట్ మేరీ లైట్, వినియోగదారుల కోసం మరింత మెరుగైన రుచి, తాజా ప్యాకేజింగ్, ఆకర్షణీయమైన సరికొత్త ప్రణాళికతో మార్కెట్లో ఒక కొత్త అవతారంలోకి మార్పు చెందింది. సన్‌ఫీస్ట్ మేరీ లైట్ కొత్త ప్రచార కార్యక్రమం, బిస్కెట్ యొక్క కరకరలాడేదనం, రుచిని మాత్రమే హైలైట్ చేయడం కాకుండా, అంతర్లీనంగా ఒక భావోద్వేగపూరిత సందేశాన్ని కూడా ఇస్తుంది. జంటలు పటిష్టమైన జట్టుగా వ్యవహరించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. “లైట్ మూమెంట్స్ చేసేను స్ట్రాంగ్ టీమ్” అనే ట్యాగ్‌లైన్, భార్యాభర్తల మధ్య ఆహ్లాదకరమైన, సరదా క్షణాల ఆవశ్యకతను తెలియజేస్తుంది. వారి మధ్య పటిష్టమైన అనుబంధం ఏర్పడటంలో ఇవే అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి. ‘స్ట్రాంగ్ టీమ్’ కాన్సెప్టును తీసుకుని, బ్రాండ్ ఇప్పుడు సన్‌ఫీస్ట్ మేరీ లైట్ ఉత్పత్తిని కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రతో పాటు భారతదేశంలోని పలు ఇతర రాష్ట్రాల్లో ప్రవేశపెట్టింది.
 
అంతేగాకుండా, ప్రజాదరణ పొందిన సెలబ్రిటీ అయిన జ్యోతిక తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు సన్‌ఫీస్ట్ మేరీ లైట్ ప్రకటించింది. ఈ ఉత్తేజకరమైన భాగస్వామ్యం, సన్‌ఫీస్ట్ మేరీ లైట్‌ను తిరిగి ఆవిష్కరించడాన్ని జ్యోతిక నటించిన తాజా, మనసుకు హత్తుకునే టీవీసీతో వేడుకగా జరుపుకుంటోంది.
 
“స్ట్రాంగ్ టీమ్స్: బార్న్ ఫ్రం లైట్ మూమెంట్స్ బిట్వీన్ కపుల్స్” అనే ప్రచార కార్యక్రమంలోని ప్రధాన సందేశం, సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బ్రాండ్ యొక్క ప్రణాళికను అత్యంత మనోహరంగా ఆవిష్కరిస్తుంది. మనందరి జీవితాల్లో, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వచ్చే మనోజ్ఞమైన, సరళమైన ఆ క్షణాలను, పదిలపర్చుకోవాల్సిన ప్రాధాన్యతను చాటి చెప్పాలన్నది బ్రాండ్ ప్రధాన లక్ష్యం. ఇవే మనకెంతో ప్రియమైన వారితో బంధాలను పటిష్టపరుస్తాయి. సాధారణంగా ఉదయాన్నే టీ/కాఫీతో మేరీలైట్ బిస్కెట్లు ఆరగిస్తూ, భాగస్వాముల మధ్య అవగాహన, సాన్నిహిత్య భావనను పెంపొందించే సరదా సంభాషణలు సాగుతున్న వేళలో ఇలాంటి క్షణాలు ఆవిష్కృతమవుతాయి.
 
ఐటీసి లిమిటెడ్ బిస్కెట్స్ & కేక్స్ క్లస్టర్, ఫుడ్స్ డివిజన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ అలీ హ్యారిస్ షేర్ ఈ భాగస్వామ్యంపై హర్షం వ్యక్తం చేశారు. “ప్రతి ఇంటా ఒక పటిష్టమైన జట్టును సృష్టించడంలో సహాయపడాలన్నది సన్‌ఫీస్ట్ మేరీ లైట్ లక్ష్యం. ఓ కప్పు టీతో సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్లు ఆరగిస్తూ, జంటలు ఒకరితో మరొకరు సమయాన్ని గడిపే సందర్భాల్లో ఇలాంటి సందర్భాలు ఆవిష్కృతమవుతాయి. ఆత్మావలోకనం చేసుకుని, తమ తమ అభిప్రాయాలను పంచుకుని, రోజువారీ జీవిత రేసు కోసం పునరుత్తేజం పొందేందుకు భార్యాభర్తలు కలిసికట్టుగా నిర్వహించే డగ్‌అవుట్ సందర్భంలాంటిది ఇది. అత్యంత ప్రతిభావంతురాలు మరియు ఎంతో పేరొందిన జ్యోతిక మా సన్‌ఫీస్ట్ మేరీ లైట్‌కి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనుండటం మాకెంతో సంతోషం కలిగిస్తోంది” అని ఆయన తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో విద్యా సంస్థలకు క్రిస్మస్ - సంక్రాంతి సెలవులు ఖరారు