Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రిలయన్స్ జియోను వణికించిన ఆఫర్.. టెలినార్ పిడిగుద్దు

నాలుగు నెలల వ్యవధిలో పది కోట్ల వినియోగదారులను సొంతం చేసుకుని విర్రవీగుతున్న రిలయన్స్ జియోకు మాడు పగిలే పరిణామం మార్కెట్లో సంభవించింది. నాలుగు నెలలు ఫ్రీ, ఏప్రిల్ నుంచి అతితక్కువ ధరకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ అంటూ భారీ ప్రచారంతో ముందుకొచ్చి భారతీయ మార్

రిలయన్స్ జియోను వణికించిన ఆఫర్.. టెలినార్ పిడిగుద్దు
హైదరాబాద్ , బుధవారం, 29 మార్చి 2017 (03:39 IST)
నాలుగు నెలల వ్యవధిలో పది కోట్ల వినియోగదారులను సొంతం చేసుకుని విర్రవీగుతున్న రిలయన్స్ జియోకు మాడు పగిలే పరిణామం మార్కెట్లో సంభవించింది.  నాలుగు నెలలు ఫ్రీ, ఏప్రిల్ నుంచి అతితక్కువ ధరకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ అంటూ భారీ ప్రచారంతో ముందుకొచ్చి భారతీయ మార్కెట్‌ను అమాంతంగా కైవసం చేసుకున్న జియో ఇప్పుడు ప్రత్యర్థి విసిరిన పంజా దెబ్బకు చిత్తు కానున్నట్లు సమాచారం. 
 
నార్వేకు చెందిన టెలికాం కంపెనీ టెలినార్ మంగళవారం ఓ స్పెషల్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ కింద కేవలం రూ.47కు 56జీబీ 4జీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. ఈ డేటా 28 రోజుల వరకు వాలిడిటీ ఉంటుందట. అయితే ఎవరైతే రోజుకు గరిష్టంగా 2జీబీ డేటాను వాడుతారో ఆ సబ్ స్క్రైబర్లకు మాత్రమే ఈ  ప్లాన్‌ను సద్వినియోగం చేసుకోవడానికి వీలవుతుందని కంపెనీ ప్రకటించింది.  ఈ కొత్త ప్లాన్ కింద 80 పైసలకే 1జీబీ డేటాను అందిస్తామని.. కానీ కండిషన్లు అప్లయ్ అవుతాయని టెలినార్ ఓ ప్రకటలో తెలిపింది.
 
టెలినార్ ప్రకటించిన ఈ ఆఫర్, రిలయన్స్ జియో కొత్తగా అమలుచేయబోతున్న రూ.303 ప్లాన్‌ను  పోలి ఉందని తెలుస్తోంది. జియోను టార్గెట్ గా చేసుకుని టెలినార్ ఈ ఆఫర్ ను ప్రకటించిందట. అయితే ఈ ప్లాన్ కింద జియో మాదిరి ఉచిత వాయిస్ కాల్స్ ను టెలినార్ అందించడం లేదు. కేవలం 56జీబీ డేటాను మాత్రమే అందించనుంది. అర్హతగల యూజర్లకు టెలినార్ ఎస్ఎంఎస్ రూపంలో ఈ ప్రాసెస్ గురించి పేర్కొంటోంది. అయితే ఈ ఆఫర్ అందరికీ కాకుండా టెలినార్ ఇన్ సైడ్ సర్కిళ్లకు మాత్రమే కంపెనీ అందించనుంది.  
 
రిలయన్స్ జియో సంచలనమైన డేటా ఆఫర్లతో టెలికాం కంపెనీలన్నీ ఒక్క  ఉదుటున కిందకి దిగొస్తున్నాయి అంటున్నారు కానీ ఈ కంపెనీల మధ్య పోటీ కారణంగా కస్టమర్లే లాభపడతారు కాబట్టి ఈ సరికొత్త పరిణామాన్ని దాని ఫలితాలను గమనించాల్సిందే.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుర్తు తెలియని బ్యాగ్ ఎవరు తెచ్చారు. వైట్‌హౌస్ గజగజ