04-01-2017 నుంచి 31-12-2017 వరకూ ఫ్రీ ఎయిర్ టెల్ డేటా... జియోకు ధీటైన ప్యాకేనా...?
ఉచితమంటేనే అగ్నిగుండంలా మండిపోయిన ఎయిర్ టెల్ రిలయన్స్ జియో దెబ్బకు తను కూడా దిగిరాక తప్పలేదు. ఉచిత ఆఫర్లతో జియో ముందుకు దూసుకెళ్లడాన్ని తట్టుకోలేని ఎయిర్ టెల్ తనూ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించి జియోకు గట్టి ష
ఉచితమంటేనే అగ్నిగుండంలా మండిపోయిన ఎయిర్ టెల్ రిలయన్స్ జియో దెబ్బకు తను కూడా దిగిరాక తప్పలేదు. ఉచిత ఆఫర్లతో జియో ముందుకు దూసుకెళ్లడాన్ని తట్టుకోలేని ఎయిర్ టెల్ తనూ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించి జియోకు గట్టి షాక్ ఇచ్చింది. ఇతర నెట్వర్కుల నుంచి తమ 4జి నెట్వర్కులోకి వచ్చే వినియోగదారులందరికీ రూ.9 వేల విలువైన డేటాను.. 2017 జనవరి 4 నుంచి డిసెంబరు చివరి వరకూ ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
4జీ మొబైల్ హ్యాండ్సెట్ వున్నవారికి ఈ ఆఫర్ ఉచితంగా అందుబాటులోకి వస్తుంది. జనవరి 4 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అలాగే ఉచిత ఆఫర్ కోసం ఎయిర్ టెల్ నెట్వర్కులోకి కొత్తగా చేరేవారికి నెలకు 3 జీబీ చొప్పున డిసెంబర్ 31, 2017 వరకు ఉచిత డేటా అందించనున్నట్లు తెలియజేసింది.
ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్‌లతోపాటు సాధారణంగా వచ్చే ప్యాకేజీలకు ఇది అదనమనీ, ప్రీపెయిడ్‌లో రూ.345 రీచార్జ్ చేసుకొనేవారికి వచ్చే 1 జీబీ డేటాకు అదనంగా నెలకు మరో 3 జీబీ డేటా అందుతుందని తెలిపింది. ఈ ఫ్రీ డేటా ప్రతి నెలా 28 రోజుల పాటు ఉంటుందని సంస్థ తెలియజేసింది. కాగా 2017 మార్చి తర్వాత కూడా జియో తన ఉచిత ఆఫర్లను తమ కస్టమర్లకు అందించేందుకు సమాయత్తమవుతుందని సమాచారం. ఈ నేపధ్యంలో పోటీని తట్టుకునేందుకు ఎయిర్ టెల్ ఈ ఆఫర్ ప్రకటించింది.