Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంపెనీ బ్రాండ్ పేరుతో విక్రయించే నకిలీ ఉత్పత్తులను అడ్డుకోవడానికి జిందాల్ దాడులు

Advertiesment
police

ఐవీఆర్

, మంగళవారం, 20 మే 2025 (16:25 IST)
భారతదేశంలోని ప్రముఖ డౌన్‌స్ట్రీమ్ స్టీల్ ఉత్పత్తుల తయారీదారులలో ఒకటైన జిందాల్ (ఇండియా) లిమిటెడ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల, కోయిల్‌కుంట్లలో జిందాల్ సబ్రాంగ్ బ్రాండ్ల కలర్ కోటెడ్ రూఫింగ్ షీట్‌ల అక్రమ, అనధికార తయారీ, పంపిణీని కనుగొంది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా, స్థానిక పోలీస్ అధికారుల మద్దతుతో మెహబూబ్ ట్రేడర్స్, ఆర్‌ఎస్ రోడ్, కోయిల్‌కుంట్లలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ ప్రాంగణాలపై దాడులు నిర్వహించి, జిందాల్(ఇండియా)లిమిటెడ్ యొక్క నకిలీ ఉత్పత్తుల తయారీ, సరఫరాలో పెద్ద ఎత్తున అక్రమ కార్యకలాపాలు జరిగినట్లు కనుగొంది.
 
జిందాల్(ఇండియా) లిమిటెడ్‌‌కు మార్కెట్లో ఉన్న పేరు దృష్టిలో పెట్టుకుని, నకిలీ జిందాల్ సబ్రాంగ్ స్టీల్ కలర్ కోటెడ్ షీట్‌లను విక్రయించడం ద్వారా అక్రమ్ మార్గాలలో సంపాదించాలని కొంతమంది వ్యక్తులు చేసిన అక్రమ కార్యకలాపాలు తదుపరి దర్యాప్తులో బయటపడ్డాయి. స్థానిక అధికారుల విచారణలో, ఒక వ్యక్తి దాదాపు రెండున్నర సంవత్సరాలుగా హైదరాబాద్‌లోని ఒక హోల్‌సేల్ వ్యాపారి నుండి నకిలీ రూఫింగ్ షీట్‌లను కొనుగోలు చేస్తున్నామని వెల్లడించాడు. కస్టమర్లను తప్పుదారి పట్టించడం ద్వారా, లాభాలను పెంచుకోవడానికి వారు వాస్తవ ధర కంటే ఎక్కువ వసూలు చేసేవారని కూడా ఇది వెల్లడించింది.
 
‘‘మా లోగో, బ్రాండ్ పేరును దుర్వినియోగం చేయడంతో పాటుగా మా కంపెనీ ఖ్యాతిని దెబ్బతీసే రీతిలో చేస్తోన్న చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడానికి మేము పోలీసులు, చట్టపరమైన బృందాలతో కలిసి పనిచేస్తున్నాము. మోసపూరిత కార్యకలాపాలు పునరావృతం కాకుండా నిరోధించడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది,’’ అని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇటీవలి పరిణామాల దృష్ట్యా, తమ కస్టమర్‌లు, కాంట్రాక్టర్లు, ఫ్యాబ్రికేటర్లు, రిటైలర్లు జాగ్రత్తగా ఉండాలని, అధీకృత డీలర్ల ద్వారా మాత్రమే ఉత్పత్తులను కొనుగోలు చేయాలని జిందాల్(ఇండియా) లిమిటెడ్ విజ్ఞప్తి చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Chandrababu: మే 22 నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలో చంద్రబాబు