ఎయిర్ బస్ టిక్కెట్లా... ఎర్రబస్సు టిక్కెట్లా... పెస్టివల్ ఆఫర్ రూ.396 నుంచి ప్రారంభం
విజయవాడ: ఆర్టీసీ ఎర్ర బస్సు ఎక్కితేనే వందలకు వందలు టిక్కెట్లు కట్ చేస్తున్నారు. ఇక విమానయానం అంటే మాటలా... కాదు... ఇపుడు ఎయిర్ టిక్కెట్ రూ.396తో ప్రారంభం అంటే మీరు నమ్ముతారా. అవునండి ఇది పండగ ఆఫర్ మరి. పండుగలను పురస్కరించుకుని స్పైస్ జ
విజయవాడ: ఆర్టీసీ ఎర్ర బస్సు ఎక్కితేనే వందలకు వందలు టిక్కెట్లు కట్ చేస్తున్నారు. ఇక విమానయానం అంటే మాటలా... కాదు... ఇపుడు ఎయిర్ టిక్కెట్ రూ.396తో ప్రారంభం అంటే మీరు నమ్ముతారా. అవునండి ఇది పండగ ఆఫర్ మరి. పండుగలను పురస్కరించుకుని స్పైస్ జెట్, జెట్ ఎయిర్ వేస్ సంస్థలు.. ఫెస్టివ్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. ఆఫర్‌లో భాగంగా జెట్ ఎయిర్‌వేస్ ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో టికెట్ ధరలు 396 రూపాయల నుంచి ప్రారంభం కానుండగా, స్పైస్‌జెట్ టికెట్ ధరలు 888 రూపాయల నుంచి ప్రారంభం కానున్నాయి.
అంతర్జాతీయ రూట్లకు సంబంధించి టికెట్ ధరలు 3,699 రూపాయల నుంచి ప్రారంభమవుతాయని స్పైస్‌జెట్ తెలిపింది. గ్రేట్ ఫెస్టివల్ సేల్ ఆఫర్‌లో భాగంగా ప్రయాణికులు ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు నవంబర్ 8 నుంచి 2017 ఏప్రిల్ 13 మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని స్సైస్ జెట్ పేర్కొంది.
బెంగళూరు- కోచి, ఢిల్లీ- డెహ్రడూన్, చెన్నై- బెంగళూరు వంటి మార్గాల్లో 888 రూపాయల ఆఫర్(ఆల్ ఇన్, వన్ వే) అందుబాటులో ఉండనుండగా చెన్నై-కొలంబో రూట్లలో 3,699 రూపాయల ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. కాగా స్పెషల్ ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన మార్గాల్లో టికెట్లను ఈ నెల 4 నుంచి 7 వరకు అందుబాటులో ఉంటాయని జెట్ ఎయిర్‌వేస్ పేర్కొంది. టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు నవంబర్ 8 నుంచి ప్రయాణించవచ్చని తెలిపింది.