Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సరికొత్త 1.9 లీటర్‌ డీడీఐ ఇంజిన్‌తో శక్తివంతమైన పర్సనల్‌ పికప్‌ వాహనాలను విడుదల చేసిన ఇసుజు

సరికొత్త 1.9 లీటర్‌ డీడీఐ ఇంజిన్‌తో శక్తివంతమైన పర్సనల్‌ పికప్‌ వాహనాలను విడుదల చేసిన ఇసుజు
, సోమవారం, 10 మే 2021 (19:32 IST)
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బీఎస్‌ 6 ఉద్గార ప్రమాణాలు కలిగిన వీ- క్రాస్‌ వేరియంట్స్‌ను భారతదేశంలో నేడు ఇసుజు మోటర్స్‌ ఇండియా ఆవిష్కరించింది. ఈ కంపెనీ ఇప్పుడు పూర్తి సరికొత్త మోడల్‌ ఇసుజు హై ల్యాండర్‌ మరియు నూతన వీ క్రాస్‌ జెడ్‌ ఏటీ  వేరియంట్లను ఔత్సాహిక నగర భారతీయ వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు ఆవిష్కరించింది. ఇది సృష్టించిన పికప్‌ సంస్కృతి పట్ల వీరు అమితాసక్తిని కనబరుస్తున్నారు. ఈ కంపెనీ ఇప్పుడు బీఎస్‌ 6 ఉద్గార ప్రమాణాలు కలిగిన ఎంయు-ఎక్స్‌మోడల్స్‌ను సైతం వీటితో పాటుగా ఆవిష్కరించింది. ఈ నూతన మోడల్స్‌ జోడింపుతో, ఇసుజు మోటర్స్‌ ఇండియా ఇప్పుడు మరింత సమగ్రమైన శ్రేణి పర్సనల్‌ పికప్‌ వాహనాలను మరియు ఎస్‌యువీలను అందిస్తుంది. వీటిలో వీ-క్రాస్‌ జెడ్‌ ప్రెస్టిజ్‌ (4డబ్ల్యుడీ/ఏటీ), వీక్రాస్‌ జెడ్‌ (4డబ్ల్యుడీ/ఎంటీ), వీ క్రాస్‌ జెడ్‌ (2డబ్ల్యుడీ/ఏటీ), హై ల్యాండర్‌ (2డబ్ల్యుడీ/ఎంటీ) మరియు ఎంయు-ఎక్స్‌ (4డబ్ల్యుడీ/ఏటీ మరియు 2డబ్ల్యుడీ/ఏటీ) ఉన్నాయి.
 
శక్తివంతమైన మరియు ఉత్సాహవంతులైన భారతీయులకు ఆకర్షణీయమైన ఉత్పత్తిని అందించాలనే ప్రయత్నంతో పాటుగా సాహస స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇసుజు మోటర్స్‌ ఇండియా ఇప్పుడు భారతదేశపు మొట్టమొదటి అడ్వెంచర్‌ యుటిలిటీ వాహనం ఇసుజు డీ-మ్యాక్స్‌ వీ-క్రాస్‌ను ఆటో ఎక్స్‌పో 2016వద్ద విడుదల చేసింది. లైఫ్‌స్టైల్‌ వాహనం కోసం పెరుగుతున్న అవసరాలను ఇది తీర్చడంతో పాటుగా భారతదేశంలో పికప్‌ సంస్కృతిని రగ్డ్‌ మరియు మన్నికైన ఆఫ్‌ రోడింగ్‌ సామర్థ్యం సమ్మేళనంతో ప్రయాణీకుల వాహన తరహా సౌకర్యం అందిస్తుంది. ఇసుజు డీ-మ్యాక్స్‌ వీ క్రాస్‌, సాహసప్రేమికుల కలలను సాకారం చేయడంతో పాటుగా జీవితంలో నూతన అంశాలను అన్వేషించేందుకూ తోడ్పడుతుంది. ఈ పికప్‌ కఠినమైనది మరియు మన్నికైనది. ఆకర్షణీయమైన శైలిని ఇది విస్తృత శ్రేణి సౌక్యర్యం మరియు భద్రతా ఫీచర్లతో అందిస్తుంది. ఇసుజు యొక్క లెజండరీ ఇంజినీరింగ్‌ అత్యున్నత శ్రేణి సామర్థ్యం మరియు విశ్వసనీయతను అందించడంతో పాటుగా పనితీరు మరియు శైలితో వినియోగదారుల మనసులను గెలుచుకునే రీతిలో తీర్చిదిద్దారు.
 
బీఎస్-6 శ్రేణి వాహనాలు ఆధునిక, తేలికైన మరియు సమర్థవంతమైన 1.9 లీటర్‌ డీడీఐ ఇంజిన్‌తో వస్తున్నాయి. ఇవి అత్యంత ఆకర్షణీయమై రీతిలో 120కిలోవాట్‌/163 పీఎస్‌ శక్తిని కలిగి ఉండటంతో పాటుగా గరిష్టంగా 360ఎన్‌ఎం టార్క్‌ను 2000-2500 ఆర్‌పీఎం వద్ద అందిస్తాయి. ఈ సాంకేతికాధారిత అత్యాధునిక ఇంజిన్‌ అత్యుత్తమ, సంపూర్ణమైన కంబషన్‌ను అన్ని ఇంజిన్‌ స్పీడ్స్‌ వద్ద అందిస్తుంది. తద్వారా ఆహ్లాదకరమైన మోటరింగ్‌ అనుభవాలనూ అందిస్తుంది. ఈ ఇంజిన్‌తో క్యాబిన్‌లో ఎన్‌వీహెచ్‌ స్ధాయిలు తక్కువగా ఉంటాయి. తద్వారా దానిలో ప్రయాణిస్తున్న వారికి మొత్తంమ్మీద సౌకర్యం అందిస్తుంది.
 
ఈ వాహనాలు పొజిషన్‌ సెన్సార్‌తో వేరియబల్‌ జియోమెట్రిక్‌ టర్బోచార్జర్‌ను కలిగి ఉంటాయి. ఇది ప్రభావవంతంగా ఇంధనం మండేందుకు తోడ్పడుతుంది. ప్రభావవంతమైన ఆఫ్టర్‌ ట్రీట్‌మెంట్‌ ఉపకరణాలలో ఎల్‌ఎన్‌టీ (లీన్‌ నాక్స్‌ ట్రాప్‌), డీపీడీ (డీజిల్‌ పర్టిక్యులర్‌ డిఫ్యూజర్‌) మరియు ఏ-ఎస్‌సీఆర్‌ (యాక్టివ్‌ సెలెక్టివ్‌ క్యాటలిస్ట్‌ రిడక్షన్‌) ఉంటాయి. ఇవి వాహనాలు ప్రభావవంతంగా ఉద్గార వాయువులను మరియు పర్టిక్యులర్‌ మేటర్‌ను శుద్ధి చేసేందుకు తోడ్పడతాయి. ఇది మరింతగా ఎలకా్ట్రనికల్‌గా నియంత్రించబడుతున్న వేడి మరియు చల్లటి (ఎగ్జాస్ట్‌ గ్యాస్‌ రిడక్షన్‌) వ్యవస్థ సహాయంతో గరిష్టంగా శుద్ధి నిర్వహణకూ తోడ్పడుతుంది.
 
బీఎస్‌-6 శ్రేణిలో పరిచయం చేసిన నూతన 6-స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ ఈ విభాగంలో తొలిసారి. పికప్‌ వాహన విభాగంలో మరింత డ్రైవింగ్‌ సౌకర్యం  అందిస్తుంది. ఇది జీఎస్‌ఐ (గేర్‌ షిప్ట్‌ ఇండికేటర్‌)తో వస్తుంది. తద్వారా ఎలాంటి సవారీ పరిస్థితులలో అయినా సరైన గేర్‌ను వినియోగించేందుకు ఇది తోడ్పడుతుంది. తద్వారా టార్క్‌, ఇంధన నిర్వహణ మరియు డ్రైవ్‌ట్రైన్‌మన్నిక ద్వారా అత్యుత్తమతకు భరోసా అందిస్తుంది. సమర్థవంతమైన 6 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ , ఇంటిలిజెంట్‌ ట్రాన్స్‌మిషన్‌కు భరోసా అందిస్తుంది. దీనిలోని అడాప్టివ్‌ గ్రేడ్‌ లాజిక్‌ కంట్రోల్‌ వాహనాన్ని సరైన గేర్‌లో నిలిపేందుకు తోడ్పడుతుంది. తద్వారా ఓవర్‌ రెవ్వింగ్‌ నిరోధిస్తుంది. అంతేకాకుండా, డైరెక్ట్‌ డ్రైవ్‌ ఎబిలిటీ  మూడు మరియు ఆరు గేర్లలో స్థిరమైన వేగంతో వెళ్లినప్పుడు అత్యధిక ఇంధన సామర్థ్యంను నిర్థారిస్తుంది.
 
ఈ నూతన శ్రేణి అత్యంత విజయవంతమైన సైబోర్గ్‌-ఓర్కా స్ఫూర్తితో పదునైన, దూకడైన మరియు ధృడమైన దీని డిజైన్‌ లక్షణాలు బోల్డ్‌ మరియు ఆధిపత్యపు శైలిని ముందుకు తీసుకువెళ్తుంది. ఇది ఏరోడైనమిక్‌గా ప్రొఫైల్‌లో మస్క్యులర్‌ మరియు ఆర్చ్‌లతో మిళితం కావడంతో పాటుగా నిలిచి ఉన్నప్పుడు కూడా దీని యొక్క దూకుడైన వైఖరిని ప్రదర్శిస్తుంది.
 
నూతన ఇసుజు హై ల్యాండర్‌ ఆకర్షణీయమైన గ్రే గ్రిల్‌ మరియు బంపర్‌ డిజైన్‌తో ధృడమైన లుక్‌ను ప్రదర్శిస్తుంది. దీనిలో హై రైడ్‌ సస్పెన్షన్‌ ఉంది. ఇది అత్యధిక గ్రౌండ్‌ క్లియరెన్స్‌ను అందిస్తుంది. పెద్దదైన వీల్‌బేస్‌తో దీనిని ట్రాక్‌ చేయవచ్చు. మరిన్ని ఆకర్షణలలో నూతన హెడ్‌ల్యాంప్స్‌ డిజైన్‌, గ్రే ఔట్‌సైడ్‌ రియర్‌ వ్యూ మిర్రర్స్‌, బాడీ కలర్డ్‌ డోర్‌ హ్యాండిల్స్‌, 16 అంగుళాల వీల్స్‌ ఆకర్షణీయమైన వీల్‌ కవర్స్‌ను కలిగి ఉండటంతో పాటుగా క్రోమ్‌ టైల్‌గేట్‌ హ్యాండిల్‌ను సైతం కలిగి ఉంది. దీని ప్రొఫైల్‌ బ్లాక్డ్‌ ఔట్‌ బీ పిల్లర్‌తో స్లీక్‌ లుక్‌తో ఉంటుంది. సౌకర్యవంతమైన మరియు ఆకర్షణీయమైన సీట్లుతో నలుపు మరియు గ్రే ఇంటీరియర్‌ లే ఔట్‌ ట్రెండీ లుక్‌ను అందిస్తుందిమరియు మరింత ఆస్వాదించతగిన సవారీని ఇది అందిస్తుంది. శక్తివంతమైన ఏసీ వ్యవస్ధను మూడు డయల్స్‌తో సెంటర్‌ కన్సోల్‌పై మార్చుకోవచ్చు. హై ల్యాండర్‌ ఖచ్చితంగా ప్రాధాన్యతా ఉత్పత్తిగా ఔత్సాహిక నగర భారతీయునికి మరీ ముఖ్యంగా వ్యక్తిగత పికప్‌ విభాగంలో ప్రవేశించాలని కోరుకునే వ్యక్తులకు నిలుస్తుంది.
 
హై ల్యాండర్‌ మరియు వీ-క్రాస్‌ వేరియంట్లు క్రోమ్‌ రింగ్స్‌తో 3డీ డిజైన్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌తో వస్తాయి. ఇవి హై ఇంటెన్సిటీ డిస్‌ప్లేను సమగ్రమైన సమాచారం మరియు మెనూ ఆప్షన్స్‌తో అందిస్తారు. రెండవ వరుస ప్రయాణీకులకు సౌకర్యం జోడించడాఇనికి, సౌకర్యవంతమైన వెనుక సీట్లు మరియు అదనపు ఏసీ వెంట్స్‌ ఉన్నాయి. ఇవి రెండవ వరుస యుఎస్‌బీ చార్జింగ్‌ పోర్ట్‌తో సహా అందిస్తాయి. హై ల్యాండర్‌ మరియు వీ-క్రాస్‌ జెడ్‌ వేరియంట్లులో అత్యున్నతమైన డ్యాష్‌బోర్డ్‌, సెంటర్‌ కన్సోల్‌ మరియు డోర్‌ హైలైట్స్‌ ఉంటాయి. ఇవి ఆహ్లాదకరమైన లేఔట్‌ను బ్లాక్‌ మరియు గ్రే రంగులో అందిస్తాయి. వీ –క్రాస్‌ జెడ్‌ ప్రెస్టిజ్‌ లో ప్రీమియం ఫినీష్‌ డ్యాష్‌బోర్డ్‌ ఉంది. ఇది పియానో బ్లాక్‌ హైలెట్స్‌ కలిగి ఉండటంతో పాటుగా సాఫ్ట్‌ టచ్‌ ప్యానెల్స్‌ను సైతం కలిగి ఉంది. ఇవి అత్యంత ఆకర్షణీయమైన స్పోర్టీ డ్యూయల్‌ టోన్‌ బ్రౌన్‌ మరియు గ్రే లెదర్‌ సీటింగ్‌తో వస్తాయి.
 
వీ-క్రాస్‌ జెడ్‌ ప్రెస్టిజ్‌ మరియు వీ-క్రాస్‌ జెడ్‌ వేరియంట్లులో బై-ఎల్‌ఈడీ ఆటో లెవలింగ్‌ ప్రొజెక్టర్‌ హెడ్‌ లైట్స్‌ ఉన్నాయి. ఇవి 50% పొడవైన మరియు వెడల్పైన రీతిలో కాంతి కిరణాలను వెదజల్లుతాయి. గన్‌ మెటల్‌ ఫినీష్‌తో షార్క్‌ ఫిన్‌ యాంటెన్నా, 18 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ మరియు ఆకర్షణీయమైన సైడ్‌ స్టెప్‌ వంటివి స్పోర్టీయర్‌ లుక్‌ మరియు వినియోగదారుల సౌకర్యం అందిస్తుంది. ఈ విభాగంలో తొలిసారిగా, వీ క్రాస్‌లో పెస్‌ (పాసివ్‌ ఎంట్రీ అండ్‌ స్టార్ట్‌ స్టాప్‌ సిస్టమ్‌) సౌకర్యం మరియు భద్రత కోసం అందుబాటులో ఉంటుంది. ఈ పెస్‌ ఫీచర్‌ వాహనానికి అతి సులభమైన ప్రాప్యతను అందించడంతో పాటుగా ఒక్క బటన్‌ క్లిక్‌తో ఇంజిన్‌ స్టార్టింగ్‌/స్టాపింగ్‌ సౌకర్యమూ జోడిస్తుంది. ఈ వీ–క్రాస్‌ వేరియంట్స్‌ ఇప్పుడు స్టీరింగ్‌ మౌంటెడ్‌ ఆడియో కంట్రోల్స్‌తో వస్తుంది మరియు ఏడు అంగుళాల టచ్‌ స్ర్కీన్‌ ఆడియో సిస్టమ్‌ యుఎస్‌బీ ఇన్‌పుట్‌, డీవీడీ, ఆక్స్‌. ఐపాడ్‌ మరియు బ్లూ టూత్‌ కనెక్టివిటీతో వస్తుంది.
 
ఇసుజు డీ మ్యాక్స్‌ వీ క్రాస్‌ 4డబ్ల్యుడీ వేరియంట్లు టెరియన్‌ కమాండ్‌ ఫీచర్‌ షిప్ట్‌ ఆన్‌ ఫ్లై డ్రైవ్‌ మోడ్‌తో కూడి ఉంటాయి. వీటితో పాటుగా హై రైడ్‌ సస్పెన్షన్‌ అత్యధిక గ్రౌండ్‌ క్లియరెన్స్‌, విస్తృతశ్రేణి ట్రాక్‌ను పొడవైన వీల్‌ బేస్‌తో అందిస్తుంది. వీ-క్రాస్‌ వేరియంట్లు రివర్శ్‌ పార్కింగ్‌ సెన్సార్స్‌ మరియు రియర్‌ కెమెరాను అతి సులభమైన పార్కింగ్‌ కోసం కలిగి ఉంటుంది.
 
ఇసుజు వాహనాలు వాటి యొక్క ధృడమైన బాడీ నాణ్యత పరంగా సుప్రసిద్ధమైనవి. ఈ నూతన వాహనాలు ఆ గుర్తింపుకు తగినట్లుగా ఉంటాయి. ఈ వాహనాలు ఐగ్రిప్‌ ప్లాట్‌ఫామ్‌తో వస్తున్నాయి (ఇసుజు గ్రావిటీ రెస్పాన్స్‌ ఇంటిలిజెంట్‌ ప్లాట్‌ఫామ్‌). ఇది సుదీర్ఘకాల మన్నిక, స్ధిరత్వం అందిస్తుంది. ఇవి పూర్తిగా అత్యున్నత శ్రేణిలోప్రయాణీకుల భద్రతా ఫీచర్లును కలిగి ఉన్నాయి. వీటిలో బీఓఎస్‌ (బ్రేక్‌ ఓవర్‌రైడ్‌ సిస్టమ్‌) కూడా ఉంది. ఇది అత్యవసర బ్రేకింగ్‌ (బ్రేక్‌ మరియు యాక్సలరేట్‌ పెడల్స్‌ను ఒకేసారి నొక్కిన సమయంలో) ఇంజిన్‌కు శక్తి ప్రసరించకుండా ఆపుతుంది. అత్యున్నత శ్రేణి ఆక్యుపెంట్‌ సేఫ్టీ ఫీచర్లు ప్రీ టెన్షనర్‌తో ఎత్తు మార్చుకోతగిన సీట్‌ బెల్ట్‌, లోడ్‌ లిమిటెర్‌, స్పీడ్‌ సెన్సిటివ్‌ ఆటో డోర్‌ లాక్‌, కో–డ్రైవర్‌ సీట్‌ బెల్ట్‌ రిమైండర్‌, ఫ్రంట్‌ అండ్‌ రియర్‌ క్రంపుల్‌ జోన్స్‌.
 
 ఎయిర్‌ బ్యాగ్‌లు, క్రాస్‌ కార్‌ ఫ్రంట్‌ బీమ్‌, డోర్‌ సైడ్‌ ఇంట్రూజన్‌, కొలాప్సిబల్‌ స్టీరింగ్‌ కాలమ్‌, డ్రైవ్‌ ట్రైన్‌ కోసం అండర్‌ బాడీ స్టీల్‌ ప్రొటెక్షన్‌ ఉన్నాయి. వీ-క్రాస్‌ జెడ్‌ ప్రెస్టిజ్‌ వేరియంట్‌లో ఈఎస్‌సీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌), టీసీఎస్‌ (ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌)తో కలిగి ఉండటంతో పాటుగా హెచ్‌డీసీ(హిల్‌ డీసెంట్‌ కంట్రోల్‌) సైతం ఉంటుంది. ఇది రోడ్డు పై మరియు రోడ్డు కింద కూడా అత్యుత్తమ సవారీ  అనుభవాలను అందిస్తుంది.
 
ఇవి 4-ఛానెల్‌, ఈబీడీ (ఎలకా్ట్రనిక్‌ బ్రేక్‌ ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌)తో 4-సెన్సార్‌ ఏబీఎస్‌ (యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌) కలిగి ఉంది. వీల్‌ లాకింగ్‌ను ఇది నివారిస్తుంది. ఇసుజు వాహనాలు అత్యంత మన్నిక కలిగి ఉన్నాయి. ఈ వాహనాలను 4 మిలియన్‌ కిలోమీటర్ల కోసం పరీక్షించారు. అత్యంత కఠినమైన భూభాగాలలో సైతం భారతీయ వినియోగదారులకు ఇవి అత్యంత ప్రాధాన్యతా ఎంపికలుగా నిలుస్తాయి.
 
ఇసుజు ఎంయు-ఎక్స్‌
ఇసుజు ఎంయు-ఎక్స్‌ ఖచ్చితమైన పూర్తి పరిమాణం కలిగిన ఏడు సీటర్ల ఎస్‌యువీ. ఆధునిక భారతీయ ఎస్‌యువీ కొనుగోలుదారుని అభిరుచులకు అద్దంపడుతుంది ఇది.  ఎక్స్‌టీరియర్‌ పరంగా, ఎంయు-ఎక్స్‌లో పులి స్ఫూర్తినొందిన శక్తి మరియు మస్క్యులర్‌ ఎక్స్‌టీరియర్‌ ఉండటం చేత అద్భుతంగా వాహనం నిలువడంతో పాటుగా రోడ్డుపై ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. ఈ క్లాస్‌లో స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనం కోసం తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలు ఇవి. శైలి, శక్తి, రోడ్డుపై ఆకర్షణీయమైన ఉనికిని ప్రదర్శించే రీతిలో దీనిని డిజైన్‌ చేశారు. అదే సమయంలో ఇది అత్యద్భుతమైన స్పేస్‌ మరియు సౌకర్యాన్ని కుటుంబాలకు సైతం అందిస్తుంది.
 
ఎంయు-ఎక్స్‌లో శక్తివంతమైన, ఆధునిక, లైట్‌ వెయిట్‌ 1.9 లీటర్‌ డీడీఐ ఇంజిన్‌ ఉంది. ఇది 120 కిలోవాట్‌/163 పీఎస్‌ శక్తిని మరియు ఎంయు-ఎక్స్‌ 360 ఎన్‌ఎం టార్క్‌ను 2000–2500 ఆర్‌పీఎం వద్ద అందిస్తుంది. ఈ ఇంజిన్‌తో ఎన్‌వీహెచ్‌ స్ధాయిలు క్యాబిన్‌లో తక్కువగా ఉంటాయి. అందువల్ల మొత్తంమ్మీద ఇది ప్రయాణీకులకు పూర్తి సౌకర్యం అందిస్తుంది. ఎంయు-ఎక్స్‌ వాహనాలు 4గీ2 మరియు 4గీ4 వేరియంట్లలలో  నూతన 6 స్పీడ్‌ సీక్వెన్షియల్‌ షిఫ్ట్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ 4గీ4 వేరియంట్‌లో  షిప్ట్‌ ఆన్‌ ద ఫ్లై 4గీ4 సెలెక్ట్‌ డయల్‌ను అత్యద్భుతమైన ఆఫ్‌ రోడింగ్‌ సామర్థ్యం కోసం కలిగి ఉంది.
 
ఇసుజు ఎంయు-ఎక్స్‌ కేవలం విశాలవంతమైన 7 సీటర్‌ ఎస్‌యువీని కలిగి ఉండటం మాత్రమే కాదు అతి పెద్ద మనసు కలిగి ఉన్న ఎస్‌యువీగా కూడా నిలుస్తుంది. దీనియొక్క మృదువైన లెదర్‌ సీట్స్‌, మార్చుకోతగిన వీలున్న హెడ్‌రెస్ట్స్‌ అన్ని సీట్లకూ ఉండటంతో పాటుగా సౌకర్యవంతమైన మూడవ వరుస ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ అంటే చిన్నారులు లేదంటే గ్రాండ్‌ పేరెంట్స్‌తో సహా ప్రతి ఒక్కరూ సౌకర్యం అనుభవించగలరు. ఎన్నడూ సౌకర్యం తగ్గిందని వారు భావించరు. ఒన్‌ టచ్‌ స్ల్పిట్‌ /ఫోల్డ్‌ సీట్లు రెండు మరియు మూడవ వరుసలలో ఉంటాయి. ఇవి మొత్తం కుటుంబానికి తగిన ఖాళీని లగేజీతో సహా అందించగలవని, వెకేషన్‌ సమయంలో పూర్తి ఆనందాన్ని ఇది అందిస్తుందనే భరోసానూ అందిస్తుంది. దీనిలో ట్విన్‌ కాక్‌పిట్‌ డిజైన్‌ ఉంది. ఇది డ్రైవర్‌తో పాటుగా ముందు వరుస ప్రయాణీకులకు సైతం అతి సౌకర్యవంతమైన కంట్రోల్స్‌ను అందించే రీతిలో ఉంటుంది. వీటితో పాటుగా పెంటా లింక్‌ వెనుక సస్పెన్షన్‌ అత్యద్భుతమైన సౌకర్యాన్ని ప్రయాణీకులందరికీ అందిస్తుంది. అదేసమయంలో విశాలవంతమెన క్యాబిన్‌ పలు స్మార్ట్‌ స్టోరేజీ కంపార్ట్‌మెంట్స్‌ను సైతం కలిగి ఉంటుంది.
 
ఎంయు-ఎక్స్‌ను ఎంతోమంది వినియోగదారులు దీని యొక్క కఠినత్వం, మన్నిక మరియు విశ్వసనీయత పరంగా ప్రపంచవ్యాప్తంగా అభిమానిస్తున్నారు. ఇసుజు ఎంయు-ఎక్స్‌ ఈ కోణాన్ని బలీయంగా ప్రదర్శించడంతో పాటుగా దీని యొక్క స్పేస్‌ మరియు సౌకర్యం పరంగా ఎక్కువ మంది కోరుకునే ఎస్‌యువీగా నిలుస్తుంది.
 
బీఎస్‌ 6 వాహనాల ఆవిష్కరణ గురించి శ్రీ సుగ్యు ఫుకునామా- మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఇసుజు మోటర్స్‌ ఇండియా మాట్లాడుతూ ‘‘ఇసుజు యొక్క ప్రయాణీకుల వాహనాల శ్రేణి పికప్స్‌ మరియు ఎస్‌యువీలు స్ధిరంగా ఆవిష్కరించిన నాటి నుంచి అమితాదరణ పొందుతున్నాయి. గేమ్‌ ఛేంజర్‌గా ఇవి సానుకూల ప్రభావాన్ని ఇవి కలిగించడంతో పాటుగా వివేకవంతులైన వినియోగదారుల ఔత్సాహిక వాహన అవసరాలనూ తీరుస్తున్నాయి. ఈ విభాగంలో  హై ల్యాండర్‌ మరియు వీ-క్రాస్‌ జెడ్‌ 4ఘ2 ఏటీ వేరియంట్ల ఆవిష్కరణతో మా ఆఫరింగ్‌ను విస్తరిస్తుండటం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇవి మరింత మంది వినియోగదారుల అవసరాలను తీర్చనున్నాయి. నూతన ఇసుజు ప్రయాణీకుల వాహనాలను విలువ ప్రతిపాదన మెరుగుపరిచే రీతిలో అత్యున్నత శ్రేణి డిజైన్‌, పనితీరు, సౌకర్యం, భద్రత మరియు డ్రైవింగ్‌ ఆనందాన్ని మా విలువైన వినియోగదారులకు అందించే రీతిలో అభివృద్ధి చేశాం’’ అని అన్నారు.
 
ఆయనే మాట్లాడుతూ ‘‘ భారతదేశం మాకు అత్యంత కీలకమైన మార్కెట్‌. అత్యున్నత సాంకేతికత మరియు ఇంజినీరింగ్‌ను తీసుకురావడం మేము కొనసాగించనున్నాం. అంతర్జాతీయంగా ఇసుజు ఈ ఆఫరింగ్స్‌తో ప్రసిద్ధి చెందింది. అంతర్జాతీయంగా కఠినమైన, ఆధారపడతగిన, ఇంధన సామర్థ్యం కలిగిన వాహనాలను రూపొందించడంలో ఖ్యాతి గడించింది.మా నూతన బీఎస్‌ 6 శ్రేణి ఈ లక్షణాలను ప్రదర్శించనుంది’’ అని అన్నారు.
 
శ్రీ కెన్‌ తకషిమా, డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఇసుజు మోటర్స్‌ ఇండియా మాట్లాడుతూ, ‘‘ఎస్‌యువీలకు భారతదేశంలో డిమాండ్‌ పెరుగుతుంది. ఈ సమయంలో తాము తమ తాజా ఆఫరింగ్స్‌తో ఇక్కడ ఉండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మొట్టమొదటి లైఫ్‌స్టైల్‌ ఎడ్వెంచర్‌ యుటిలిటీ వాహనంతో భారతదేశంలో ఓ బెంచ్‌మార్క్‌ను సృష్టించడం పట్ల మేము గర్వంగా ఉన్నాము. ఈ విజయగాధను ఇప్పుడు మా నూతనంగా ఆవిష్కరించిన ఇసుజు- హై ల్యాండర్‌ మరియు నూతన వీ-క్రాస్‌ జెడ్-ఏటీ వేరియంట్‌ను వీ-క్రాస్‌ శ్రేణితో ముందుకు తీసుకువెళ్లడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ విస్తృతశ్రేణి ఔత్సాహిక ఉత్పత్తులతో ఔత్సాహిక నగర వినియోగదారుల అవసరాలను తీర్చగలమని మరియు ఈవిభాగంలో మా స్ధానం బలోపేతం చేసుకోగలమని నమ్ముతున్నాం’’ అని అన్నారు.
 
ఈ వాహనాలు ఉత్సాహపూరితమైన నూతన రంగులునౌటిలస్‌ బ్లూ, స్పైనల్‌ రెడ్‌, గలెనా గ్రేలో లభిస్తుంది. వీటితో పాటుగా ప్రస్తుత ప్రీమియం సిల్కీ పెరల్‌ వైట్‌, సాలిడ్‌ వైట్‌, కాస్మిక్‌ బ్లాక్‌, సఫైర్‌ బ్లూ మరియు టైటానియం సిల్వర్‌ రంగులు కూడా లభిస్తాయి. అత్యంత ఆకర్షణీయమైన పరిచయ ధరలు వీ క్రాస్‌ జెడ్‌ (2డబ్ల్యుడీ /ఏటీ)19,98,000 రూపాయలు (ఎక్స్‌షోరూమ్‌, చెన్నై) మరియు హై ల్యాండర్‌ (2డబ్ల్యుడీ/ఎంటీ)16,98,000 రూపాయలు (ఎక్స్‌షోరూమ్‌, చెన్నై)లో లభ్యమవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా రోగులకు ఇచ్చే రెమ్‌డెసివిర్‌ సూదిమందు బ్లాక్ మార్కెట్: ఏడుగురి అరెస్టు