Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంతా కరోనా పుణ్యం.. డబుల్ డెక్కర్ విమానాలు కూడా వచ్చేస్తున్నాయ్..!

Advertiesment
అంతా కరోనా పుణ్యం.. డబుల్ డెక్కర్ విమానాలు కూడా వచ్చేస్తున్నాయ్..!
, బుధవారం, 25 నవంబరు 2020 (14:33 IST)
డబుల్ డెక్కర్ బస్సులు, రైళ్ల తరహాలో ప్రస్తుతం డబుల్ డెక్కర్ విమానాలు వచ్చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో విమానాల్లో డబుల్ డెక్కర్ సీట్లు రానున్నాయి. దీని కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రయాణికుల సంఖ్య పెరగడం వల్ల ఆదాయం వస్తుంది కనుక కంపెనీలకు ఇదేమీ భారం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
 
ప్రస్తుతం విమానాల్లో ఎకానమీ క్లాసులో ప్రయాణించేవారికి లిమిటెడ్ లెగ్ రూమ్‌లు ఉన్నాయి. ఇకపై ఇవి వుండవు. విమానం మొత్తంగా డబుల్ డెక్కర్ సీట్లు మాత్రమే ఉంటాయి. అయితే విమానాల్లో డబుల్ డెక్కర్ పరిణామానికి దారి తీసేందుకు కారణం కరోనానే. 
 
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విమానాల్లో ఈ కొత్త సీటింగ్ విధానాన్ని తీసుకువస్తున్నారు. వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య దూరం ఉండేలా సీటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. డిజైనర్ జాఫ్రీ ఓనీల్‌తో విమానయాన సంస్థలు 2-4-2 కాన్ఫిగరేషన్ సీటింగ్ అందించనున్నాయి.
1970 నుంచి చాలావరకు విమానయాన సీట్లలో మార్పులేదు.
 
ఎకానమీ క్లాస్ సీట్లలో 99 శాతం నిటారుగా నిద్రించడానికి అసాధ్యం. డబుల్ డెక్కర్ సదుపాయం వస్తే విమానాల్లో ప్రయాణించే వారిలో 70 శాతం మంది లై ఫ్లాట్ భంగిమలో నిద్రించవచ్చు. ప్రయాణికులందరికీ సౌకర్యవంతమైన విమాన ప్రయాణాన్ని అందిస్తూ.. ప్రజలకు డబ్బు ఆదా చేస్తుంది. అంతేకాదు ఎకానమీ క్లాస్‌లో సౌకర్యవంతంగా ప్రయాణించడానికి సాయపడుతుంది. 
 
సుదీర్ఘ విమాన ప్రయాణాల్లో నిద్రంచటానికి వీలుగా ఉండేలా సీటింగ్ డిజైన్ ఉంటుంది. ఏ సీటు కూడా సాంద్రత కోల్పోకుండా ఉండేలా విమానయాన సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజ్యసభ సభ్యులుగా మహామహులు పని చేశారు... చిన్నచూపు చూడకండి!