‘ఇప్పుడు కొనుక్కోండి-తర్వాత చెల్లించండి’.. ఐఆర్‌సీటీసీ కొత్త విధానం
భారతీయ రైల్వే కేటరింగ్, పర్యాటక సంస్థ (ఐఆర్‌సీటీసీ) త్వరలోనే రైల్వే టిక్కెట్ల బుకింగ్‌కు సంబంధించి సరికొత్త వెసులుబాటును ప్రజలకు కల్పించనుంది. ‘‘ఇప్పుడు కొనుక్కోండి-తర్వాత చెల్లించండి’(బై నౌ-పే లేటర్
భారతీయ రైల్వే కేటరింగ్, పర్యాటక సంస్థ (ఐఆర్‌సీటీసీ) త్వరలోనే రైల్వే టిక్కెట్ల బుకింగ్‌కు సంబంధించి సరికొత్త వెసులుబాటును ప్రజలకు కల్పించనుంది. ‘‘ఇప్పుడు కొనుక్కోండి-తర్వాత చెల్లించండి’(బై నౌ-పే లేటర్) అంటూ సులువుగా రైలు టిక్కెట్లు కొనుక్కునే వసతిని అందుబాటులోకి ప్రవేశపెట్టనుంది.
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ముందుగా రైల్వే టిక్కెట్లు రిజర్వు చేసుకోవచ్చు. డబ్బును 14 రోజుల్లోగా చెల్లించుకోవచ్చు. ముంబైకి చెందిన ‘ఈ-పే లేటర్’ భాగస్వామ్యంతో ఈ వసతిని ప్రజలకు చేరువ చేయనుంది. అయితే, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా రైలు టిక్కెట్లను బుక్ చేసుకునేవారు ముందుగా తమ ‘ఆధార్’, ‘పాన్’ కార్డు నంబరు వంటి మౌలిక వివరాలను సమర్పించాలి. ఆ తర్వాత ఈ కొత్త విధానానికి ఆ వెబ్‌సైట్ అనుమతి లభిస్తుంది.