Publish Date: Thu, 09 Apr 2026 (09:45 IST)
Updated Date: Thu, 09 Apr 2026 (09:47 IST)
దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం-చిదంబరం పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో యాత్ర ఉంటుంది. ఈ రైలులో మొత్తం 702 బెర్తులు ఉంటాయి. అందులో స్లీపర్ 160, థర్డ్ ఏసీ 490 సెకండ్ ఏసీ 52 బెర్తులు ఉంటాయి.
ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు తిరువణ్ణామలైలో అరుణాచలం ఆలయం, రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయం, మధురైలో మీనాక్షి అమ్మన్ ఆలయం, కన్యాకుమారిలో రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ టెంపుల్, తిరుచ్చిలో శ్రీ రంగనాథస్వామి ఆలయం, తంజావూరులో బృహదీశ్వరాలయం, చిదంబరంలో నటరాజ ఆలయం చూడొచ్చు.
ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర కేవలం రూ.14,500 మాత్రమే. ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం-చిదంబరం టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు మే 24న సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12 గంటలకు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ఎక్కాలి.
ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలు చూస్తే స్లీపర్ క్లాస్‌కి రూ.14,500, స్టాండర్డ్ క్లాస్‌కి రూ.21,700, కంఫర్ట్ క్లాస్‌కి రూ.27,900 చొప్పున చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్‌కి స్లీపర్ బెర్త్, నాన్ ఏసీ గదుల్లో బస, నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్ కవర్ అవుతాయి.
సెల్వి
Publish Date: Thu, 09 Apr 2026 (09:45 IST)
Updated Date: Thu, 09 Apr 2026 (09:47 IST)