Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12 నిమిషాల్లో చార్జింగ్ పూర్తయ్యే ఇన్ఫినిక్స్ మొబైల్స్ విక్రయాలు ప్రారంభం

Advertiesment
zero ultra
దేశంలో మరో కొత్త రకం మొబైల్ ఫోన్ అమ్మకానికి వచ్చింది. ఇది కేవలం 12 నిమిషాల్లోనే చార్జింగ్ పూర్తవుతుంది. ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా పేరుతో ఈ ఫోన్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ కలిగిన ఈ ఫోన్ ధర రూ.29,999గా నిర్ణయించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంకు కార్డులపై రూ.3 వేల వరకు తగ్గింపు లభించనుంది. ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్ ఈ కామర్స్‌లో అందుబాటులో ఉంచింది. 
 
6.8 అంగుళాల ఫుల్‌ హెచ్.డి, 3డీ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్ ప్లే సహా ఎన్నో ప్రత్యేకతలు ఈ ఫోన్లు కలిగివున్నాయి. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, మీడియా టెక్ డైమెన్సిటీ 920 5జీ చిప్ సెట్‌తో తయారు చేశారు. 12జీబీ ర్యాబ్ 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో తీసుకొచ్చారు. 
 
ఈ ఫోన్ వెనుక 200 మెగాపిక్సల్ కెమరాను అమర్చారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోనులో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 180 వాట్ ఫాస్ట చార్జ్‌తో కేవలం 12 నిమిషాల్లోనే పూర్తి చార్జ్ చేసుకోవచ్చు. ఈ ఫోను ధర రూ.29999గా ఉండగా, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డుపై రూ.2 వేలు, ఫెడర్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ.3 వేలు చొప్పున తగ్గింపు పొందవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డీఆర్డీవో నోటిఫికేషన్ విడుదల