ప్రముఖ భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి అపర కుబేరుడు అనే పేరుంది. తాజాగా 90.1 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలోనే నెంబర్ వన్ రిచెస్ట్ పర్సన్‌గా నిలిచారు.
ఈ మేరకు ఫోర్బ్స్ పత్రిక వివరాలు వెల్లడించింది. అంతే కాకుండా ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాల్లో పదో స్థానానికి చేరారని తెలిపింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, మార్క్ జుకర్ బర్గ్‌ను అదానీ అధిగమించారు.
అదానీ గ్రూప్‌కు పవర్ జనరేషన్ ట్రాన్స్‌మిషన్, ఎడిబుల్ ఆయిల్, రియల్ ఎస్టేట్, బొగ్గు వ్యాపారాలు ఉన్నాయి. దేశంలో అదానీ గ్రూప్‌కు ఆరు లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ఈ కారణాలతో ఏప్రిల్ 2021లో $50.5 బిలియన్లు ఉన్న సంపద ప్రస్తుతం రెట్టింపు అయ్యింది.