Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నైపుణ్య కార్యక్రమం కోసం తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకున్న ఇండియా-జర్మనీ

India Germany strengthen partnership
, శుక్రవారం, 9 డిశెంబరు 2022 (18:47 IST)
సరైన నైపుణ్యాలతో యువతకు సాధికారిత అందించడం మరియు వారికి సరైన అవకాశాలను అందించడం ద్వారా ఆర్ధికాభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా  ఇండో- జర్మన్‌ జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ యొక్క 12వ సమావేశం జరిగింది.  వృత్తి విద్య మరియు శిక్షణ (వెట్‌)ను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించారు. జర్మన్‌ ప్రమాణాలకు అనుగుణంగా ప్రాధాన్యతా రంగాలలో నైపుణ్యావసరాలను అందుకునేలా  వెట్‌ కోసం ప్రామాణిక యంత్రాంగాన్ని సంస్ధాగతీకరించడం లక్ష్యంగా ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. నైపుణ్య అంతరాలను అంచనా  వేసేందుకు స్కిల్‌ మ్యాపింగ్‌ ఎక్సర్‌సైజ్‌ చేపట్టడంతో పాటుగా దానిని అనుసరించి, బ్రిడ్జ్‌ కోర్సులు, అప్‌ స్కిల్లింగ్‌ కార్యక్రమాలను భారతీయ కార్మికుల నైపుణ్య శిక్షణ కోసం రూపకల్పన చేశారు.
 
భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి మరియు ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌ మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ డాక్టర్‌ కె కె ద్వివేది, డివిజన్‌ 222 అలెగ్జాండర్‌ హాచార్డెల్‌, సీనియర్‌ పాలసీ ఆఫీసర్‌ ఆఫ్‌ డివిజన్‌ 222 ఎరాస్మస్‌; ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ ఇన్‌ వొకేషనల్‌ ట్రైనింగ్‌, ఫెడరల్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(బీఎంబీఎఫ్‌)లు ఈ సమావేశానికి సహ అధ్యక్షతను వహించారు.
 
ఈ సమావేశంలో, రెండు భాగస్వామ్య దేశాలు శిక్షణ, మూల్యాంకనం, సర్టిఫికేషన్స్‌ కోసం అంతర్జాతీయ ప్రమాణాలను కలిగి ఉన్న సంబంధిత సంస్ధలతో జీ2జీ, జీ2బీ, బీ2బీ భాగస్వామ్యాల ద్వారా ఇరు దేశాలలోని శిక్షణా ప్రదాతలకు పరస్పర అక్రి డిటేషన్‌ ద్వారా ఆర్ధికాభివృద్దిలో నైపుణ్యం కలిగిన, సర్టిఫైడ్‌ కార్మికులు ఎలా పాల్గొనవచ్చనే దానిపై ఎంప్లాయర్‌ కనెక్ట్‌, అవగాహన కోసం కార్యాచరణ తీసుకురావడంపై కూడా  చర్చించారు.
 
ఫెడరల్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (బీఎంబీఎఫ్‌), ఫెడరల్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఎకనమిక్‌ కో-ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌(బీఎంజెడ్‌)లు ఉద్యోగ వివరణ, అర్హత ప్రమాణాలు, విదేశీ భాషా శిక్షణ, బోధనాంశాల వివరాలతో సహా ఎన్‌ఎస్‌డీసీఐకు డిమాండ్‌ అవసరాలు, ఎంప్లాయర్‌ మాండేట్స్‌ను సమగ్రం చేయడం గురించి చర్చించాయి. బీఎంబీఎఫ్‌, బీఎంజెడ్‌లు ఇప్పుడు ట్రైనింగ్‌ ఆఫ్‌ ట్రైనర్స్‌(టీఓటీ), ట్రైనర్స్‌ ఆఫ్‌ యాక్ససర్స్‌(టీఓఏ), విదేశీ భాషా శిక్షణ, పరిశ్రమ సంబంధిత కంటెంట్‌, కరికుల్యమ్‌ అభివృద్ధికి సాంకేతిక మద్దతు సైతం అందిస్తున్నాయి.
 
భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి, వ్యవస్ధాపక మంత్రిత్వశాఖ జాయింట్‌ సెక్రటరీ డాక్టర్‌ కెకె ద్వివేది మాట్లాడుతూ, ‘‘యూరోప్‌లో భారతదేశానికి అతి ముఖ్యమైన భాగస్వాములలో ఒకటి జర్మనీ. ఇరు దేశాల నడుమ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతమవుతున్నాయి. నేటి సమావేశంలో జరిగిన చర్చతో ఈ రెండు దేశాల నడుమ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. అంతేకాదు, సరైన మద్దతు, వృత్తి విద్య , శిక్షణతో ప్రతిభ ద్వారా ఆర్థికాభివృద్దిని సైతం వేగవంతం చేయనున్నాము. భారతదేశం నుంచి జర్మనీకి  కార్మిక శక్తి తరలివెళ్లేందుకు అత్యున్నత సామర్ధ్యం ఉంది. వాస్తవమేమిటంటే, 2021లో జర్మనీ యొక్క బ్లూ కార్డ్‌ గ్రహీతలలో దాదాపు మూడవ వంతు భారతదేశం నుంచి ఉన్నారు. ఇది జర్మనీలో అవసరమైన నైపుణ్యాలు మరియు ప్రతిభ;  భారతదేశంలో ఉన్న విద్య, నైపుణ్యంతో కూడిన యువత మధ్య ఉన్న సారుప్యతలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ యువతే జర్మనీతో  భారతదేశపు బహుముఖ సహకారానికి సానుకూలంగా తోడ్పాటునందిస్తుంది.
 
నైపుణ్యాభివృద్ధిలో అత్యంత స్ధిరమైన నమూనాలలో ఒకటిగా అప్రెంటిస్‌షిప్‌ ఒకటి. విద్య, వృత్తి విద్య రంగాలలో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణపై దృష్టి సారించి వర్ట్యువల్‌/ ఫిజికల్‌ ఎక్సేంజ్‌ కార్యక్రమాలకు ఇండియా ప్రతిపాదించింది. దీనిలో భాగంగా విద్యార్ధులు ఇరు దేశాలలో  ఉద్యోగ ప్రాజెక్టులపై పనిచేయడం ద్వారా కొంత సంపాదించుకోగలరు’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రంగారెడ్డిలో సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్... వంద మందితో వచ్చి...