12 నుంచి విజయవాడలో విమానయాన సదస్సు... : మంత్రి అశోకగజపతి రాజు వెల్లడి
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమానయాన రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా విజయవాడలో ఈ నెల 12న విమానయాన సదస్సు జరుగనుంది. అలాగే, వైమానిక ఉత్పత్తుల ప్రదర్శన కూడా నిర్వహించనున్నారు. ఈ సదస్సులో బ్రిటన్
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమానయాన రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా విజయవాడలో ఈ నెల 12న విమానయాన సదస్సు జరుగనుంది. అలాగే, వైమానిక ఉత్పత్తుల ప్రదర్శన కూడా నిర్వహించనున్నారు. ఈ సదస్సులో బ్రిటన్‌కు చెందిన అంతర్జాతీయ బృందం దీనిలో క్రియాశీలంగా పాలుపంచుకోనుంది.
ఇదే విషయంపై కేంద్ర విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ... విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో ఏర్పాటు చేయబోయే సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి తాను ఆవిష్కరిస్తానని చెప్పారు. దీనిలో 200 జాతీయ/అంతర్జాతీయ వైమానిక సంస్థలు, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల సంఘాలు, బ్రిటన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ దౌత్య కార్యాలయాల ప్రతినిధులు పాలుపంచుకుంటారని తెలిపారు.
వైమానిక ఉత్పత్తుల తయారీ, విమానాశ్రయాలు-వైమానిక సంస్థల మధ్య సమన్వయాలలో భారత్ సాధిస్తున్న పురోగతిపై దీనిలో దృష్టి సారించనున్నట్లు వివరించారు. విమానయాన మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య సంయుక్తంగా దీన్ని ఏర్పాటుచేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి వైమానిక సదుపాయాలు ఏర్పాటుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి తాము కృషిచేస్తున్నామన్నారు.