Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రయాణికులు ఎమిరేట్ వినూత్న ఆఫర్ ... ఉచితంగా అంతిమ యాత్ర

ప్రయాణికులు ఎమిరేట్ వినూత్న ఆఫర్ ... ఉచితంగా అంతిమ యాత్ర
, మంగళవారం, 4 ఆగస్టు 2020 (20:12 IST)
గత యేడాది బీమా కంపెనీలు తమ ప్రకటనల కోసం 7 బిలియన్ డాలర్లను ఖర్చు చేశాయి. ఇది అమెరికా ఖర్చుల్లో 2.7 శాతం. అటే 240 మిలియన్ డాలర్లు. అయితే, అమెరికాలో ఒక వ్యక్తి బీమా పొందాలంటే ఖర్చు చేయాల్సిన మొత్తం 20 డాలర్లు. ఒక జంట లేదా ఒక కుటుంబం 60 డాలర్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. 
 
ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించి బీమా పాలసీని కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరూ సాహసం చేయడం లేదు. అయినప్పటికీ అక్కడ బీమా కంపెనీలు అనేకం ఉన్నాయి. పైగా, బీమా సంస్థల వద్ద కుప్పలుతెప్పలుగా నిధులు ఉన్నాయి. అయితే, బీమా పాలసీదారులకు ఎలాంటి హాని చేయనంత వరకు బీమా కంపెనీలు మనుగడ కొనసాగించగలవు. లేని పక్షంలో ఆ కంపెనీలు దివాళా తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 
 
గత 2000 సంవత్సరంలో జీఈఐసీవో ఓ బీమా ప్రకటన ప్రణాళికను తయారు చేసింది. పైగా, ప్రతి ఒక్కరికీ సులభతరంగా ఉండేలా ప్రచార విధానాన్ని కూడా పరిచయం చేసింది. ఈ తరహా యోచన చాలా అద్భుతమైనది. ఇది ప్రజల్లోనూ, ప్రయాణికుల్లోనూ సంస్థ పట్ల మంచి నమ్మకం, విశ్వాసాన్ని కలిగిస్తుంది. పైగా, తమ ప్రయాణికుల పట్ల విమానయాన సంస్థ చూపే ప్రత్యేక శ్రద్ధగా భావించొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వెసులుబాటు చర్యలు ఎంతో ముఖ్యం. 
 
ప్రపంచంలో ఉన్న ప్రముఖ విమానయాన సంస్థల్లో ఎమిరేట్స్ ఒకటి. ఇది తమ ప్రయాణికుల కోసం సరికొత్త, నమ్మకమైన, అత్యంత విశ్వాసమైన ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. దుబాయ్ కేంద్రంగా విమాన సర్వీసులు నడుపుతున్న ఈ సంస్థ తాజాగా ఓ వినూత్న ఆఫర్ ప్రకటించింది. ఈ సంస్థకు చెందిన విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల్లో ఎవరైనా కరోనా వైరస్ సోకినట్టయిదే వైద్య ఖర్చుల కోసం 176000 డాలర్లను చెల్లించనుంది. అలాగే, ఐసోలేషన్ ఖర్చుల కోసం అంటే 14 రోజుల పాటు హోటల్ గదిలో క్వారంటైన్ ఖర్చుల కోసం 118 డాలర్లను ఖర్చు చేయనుంది. 
 
అత్యంత విషాదకరమైన సంఘటన అంటే, కరోనా వైరస్ సోకిన ప్రయాణికుడు చికిత్స పొందుతూ లేదా క్వారంటైన్‌లో ఉన్నపుడు మరణిస్తే ఆ మృతుని అంత్యక్రియలను ఉచితంగా నిర్వహించనుంది. ఇందుకోసం 1765 డాలర్లను అందజేయనుంది. ఈ బీమా టిక్కెట్ కొనుగోలుతోనే లభ్యంకానుంది. పైగా, టిక్కెట్ కొనుగోలు చేసిన క్షణం నుంచే అందుబాటులోకి వస్తుంది. మృతి చెందిన కరోనా రోగి అంత్యక్రియల సమయంలోనూ ఎలాంటి అదనపు రుసుంను వసూలు చేయబోరని ఆ సంస్థ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీరాముడు అందరివాడు.. అమెరికాలో ప్రత్యేక పూజలు.. రాముడి త్రీడీ చిత్రాలు