Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తలనొప్పి తగ్గించే ఐకానిక్ సారిడన్ మాత్ర

తలనొప్పి తగ్గించే ఐకానిక్ సారిడన్ మాత్ర
, మంగళవారం, 10 ఆగస్టు 2021 (16:54 IST)
భారతదేశ అత్యంత విశ్వసనీయ తలనొప్పి ఉపశమన మాత్ర అయిన సారిడన్‌ను సరికొత్త  రూపంలో ప్రవేశపెడుతున్నట్లుగా బాయర్ కన్జ్యూమర్ హెల్త్ డివిజన్ ప్రకటించింది. తలనొప్పికి సత్వర పరిష్కారంగా సారిడన్ ఐదు దశాబ్దాలకు పైగా ఇంటింటా వినిపించే పేరుగా ఉంది. దీని వారసత్వం, ప్రగాఢంగా ఉన్న వినియోగదారుల విశ్వాసాన్ని ఉపయోగించుకుంటూ సారిడన్ పునరావిష్కరణ క్యాంపెయిన్ చోటు చేసుకుంది. తలనొప్పిని భరించే బదులుగా దానిపై చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని చాటి చెప్పేలా ఇది ఉంటుంది. సరికొత్త, సమకాలీన ప్యాకేజింగ్‌తో యువతను ఆకట్టుకునేలా సారిడన్ వస్తోంది.
 
తలనొప్పులకు సంబంధించి మార్కెట్ అగ్రగామిగా ఉన్న సారిడన్ పునరావిష్కరణ అత్యంత సాధారణమైన, రోజు వారీ బెడద నుంచి యువతకు ఉపశమనం ఇస్తుంది. వారు చురుగ్గా తమ పనులు చేసుకోగలిగేలా చేస్తుంది. అయితే, చాలామంది ఈ నొప్పి గురించి ఇతరులతో తమ బాధను పంచుకోవడం, మందులు వేసుకోవడం వంటివి మాత్రం చేయడం లేదు. మౌనంగా బాధపడుతూ ఉంటారు. తమను ఇష్టపడేవారికి ఆందోళన కలిగించడం ఎందుకులే అని భావిస్తుంటారు. నొప్పి దానంతట అదే తగ్గిపోతుందని అనుకుంటూ ఉంటారు.
 
ఇలాంటి నొప్పులకు సంబంధించి ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం సారిడన్ ఆశయం. తన వినూత్న ట్రిపుల్ యాక్షన్ ఫార్మూలా ద్వారా ఇది తలనొప్పిని తగ్గించడంలో రహస్య భాగస్వామిగా ఉంటూ వేగంగా ఉపశమనం అందిస్తుంది. తద్వారా వారు నొప్పితో బాధపడకుండా తమ పనులు తాము చేసుకోగలుగుతారు.
 
ఈ సందర్భంగా బాయర్ కన్జ్యూమర్ హెల్త్ ఇండియా కంట్రీ హెడ్ సందీప్ వర్మ మాట్లాడుతూ, ‘‘రోజువారీ ఆరోగ్య సంరక్షణను సులభతరం చేయడం ద్వారా స్వీయ సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం. 50 ఏళ్లుగా భారతదేశవ్యాప్తంగా వినియోగదారులు తలనొప్పులతో పోరాడేందుకు సారిడన్ పై ఆధారపడ్డారు. తమ తలనొప్పిని దాచిపెట్టుకోవద్దంటూ ప్రజలను మేం కోరుతున్నాం, దానికి బదులుగా తమ విశ్వసనీ య సహాయకారి అయిన సారిడన్‌తో తలనొప్పిపై పోరాటం చేయాల్సిందిగా వారికి స్ఫూర్తినివ్వాలని మేం కోరు కుంటన్నాం. నొప్పిరహితంగా జీవించే సందర్భాలే జీవితంలో అత్యుత్తమ క్షణాలుగా ఉంటాయి. తలనొప్పిగా ఉందని ఎవరైనా అంటే, ఒక్క సారిడన్ చాలు అని మేం వారికి సూచిస్తాం’’ అని అన్నారు.
 
తన సందేశాన్ని మరింత బలోపేతం చేసేందుకు బాయర్ ఇండియా ఒక ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్స్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. తమ ఒత్తిళ్లను నిర్వహించుకోవడంలో యువతకు ఓ భాగస్వామిగా సారిడన్ అందించే వాగ్దానం, వన్ స్టాప్ మెకానిజం ఇందులో భాగంగా ఉంటాయి. 30 సెకన్ల టీవీసీ ఫీచర్, ఐకానిక్ ‘సిర్ఫ్ ఏక్ సారిడన్’ జింగిల్ దశాబ్దాలుగా వినియోగదారులతో సారిడన్ కలిగిఉన్న అనుబంధాన్ని చాటిచెబుతాయి.
 
భారతదేశంలో బాయర్ 125 ఏళ్లుగా ఓ విశ్వసనీయ బ్రాండ్‌గా ఉంది. వ్యవసాయం, ప్రజారోగ్యం, సుస్థిరదాయక తలలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తోంది. సైన్స్ ఫర్ ఎ బెటర్ లైఫ్ అనే మా పర్పస్‌ను అందించడం ద్వారా మరియు ‘హెల్త్ ఫర్ ఆల్, హంగర్ ఫర్ నన్’ అనే ఆశయాన్ని నిజం చేసే దిశగా పని చేయడం ద్వారా కంపెనీ తన పేరు ప్రఖ్యాతులను నిర్మించుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో 16 నుంచి పాఠశాల ఓపెన్ : మంత్రి ప్రకటన