Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసిఐసిఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ రిటైర్‌మెంట్‌ అధ్యయనం

Cash
, మంగళవారం, 21 మార్చి 2023 (21:07 IST)
రిటైర్‌మెంట్‌ (పదవీ విరమణ) అనేది ఓ విరామం మాత్రమే కానీ అక్కడితో ప్రయాణం ఆగిపోవడం కాదు అనేది ప్రస్తుతం భారతీయుల ధోరణిగా ఉంది. తమ జీవితంలో అతి ముఖ్యమైన మైలురాళ్లలో అది కూడా ఒకటని భావిస్తున్నారు. ఇదే అంశం ఐసిఐసిఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ స్టడీ ‘ఈజ్‌ ఇండియా ప్రిపేర్డ్‌ ఫర్‌ రిటైర్‌మెంట్‌?( పదవీవిరమణ కోసం భారతదేశం సిద్ధమైందా?)’లో వెల్లడించింది. ఈ అధ్యయనం ద్వారా తమ రిటైర్‌మెంట్‌ ప్రణాళిక దిశగా ప్రజల ధోరణి అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది.
 
ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం, రిటైర్‌మెంట్‌ను పూర్తి అవకాశాలతో నిండిన సమయంగా చూస్తున్నారు. తాజాగా జీవితం ప్రారంభించడంతో పాటుగా తాము కోరుకున్న రీతిలో జీవితం కొనసాగించడానికి అవకాశంగా చూస్తున్నారు. అధిక సంఖ్యలో వ్యక్తులు  నిర్వహణ, ఆధునీకరణ, వృద్ధి దశగా దీనిని భావిస్తున్నారు. తాము ప్రస్తుతం అనుసరిస్తున్న జీవనశైలినే రిటైర్‌మెంట్‌ తరువాత కూడా అనుసరించడం అత్యంత ప్రాధాన్యతాంశంగా చాలామంది భావిస్తున్నారు. దాదాపు 83% మంది స్పందనదారులు ఇదే చెబుతున్నారు. స్పందనదారులలో ఐదింట మూడొంతుల మంది తమ రిటైర్‌మెంట్‌ లక్ష్యాలలో జీవితాన్ని ఆస్వాదించడం, స్నేహితులతో కలిసి ఉండటం, విదేశాలకు ప్రయాణించడం, ఆర్ధికంగా సురక్షితంగా ఉండటం, తమ జీవిత నూతనధ్యాయంలో మానసికంగా ప్రశాంతంగా గడపటం ఉన్నాయి.
 
ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో మూడింట రెండొంతుల మంది ద్రవ్యోల్భణం పట్ల ఆందోళన చెందుతున్నారు. తమ రిటైర్‌మెంట్‌ పొదుపుపై అది ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్న వీరు దాని కారణంగా తమ జీవనశైలి కూడా మారుతుందని భయపడుతున్నారు. అదే సమయంలో 67% మంది స్పందనదారులు తగినంతగా రిటైర్‌మెంట్‌ కార్పస్‌ ఉండాలని, తమ రిటైర్‌మెంట్‌ తరువాత ఎదురయ్యే అనారోగ్యానికి అది తగిన తోడ్పాటునందిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం, తమ ఆదాయంలో 11%ను రిటైర్‌మెంట్‌ పొదుపు కోసం ఆదా చేసుకుంటున్నారు. ఈ మొత్తం దాదాపుగా 65.4 లక్షల రూపాయలుగా ఉంటుంది.
 
రిటైర్‌మెంట్‌ కోసం సిద్ధమవుతున్న వ్యక్తులు రిస్క్‌ ఫ్రీ, గ్యారెంటీడ్‌ రిటర్న్స్‌ అందించే యాన్యుటీ ప్లాన్స్‌ వైపు చూస్తున్నారు. యాన్యుటీ ప్లాన్స్‌ను ప్రత్యేకంగా  రిటైర్‌మెంట్‌ కోసం డిజైన్‌ చేశారు, ఇది జీవితాంతం భార్యాభర్తలకు ఆదాయం అందిస్తుంది. ఈ అధ్యయనం చెబుతున్న దాని ప్రకారం ఇప్పటివరకూ యాన్యుటీ ప్లాన్‌ తీసుకోని వారిలో 65% మంది యాన్యుటీ ప్లాన్‌ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ అధ్యయనంలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, రిటైర్‌మెంట్‌ కోసం పెట్టుబడులను ప్రారంభించిన వారిలో అధిక శాతం తమకు 40వ సంవత్సరం రాగానే తమ ఆదాయంలో 17% ఈ పథకాలలో పెట్టుబడి పెడుతున్నారు.
 
ఈ అధ్యయనం గురించి ఐసిఐసిఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ మనీష్‌ దూబే మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో పదవీ విరమణ చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. 2031 నాటికి 41%కు వృద్ధి చెందుతుందని అంచనా. మా అధ్యయనం కనుగొన్న దాని ప్రకారం, రిటైర్‌మెంట్‌ను తమ ఆసక్తులు అన్వేషించడానికి ఓ అవకాశంగా భావిస్తున్నారు. రిటైర్‌మెంట్‌ ప్లానింగ్‌ అనేది దీర్ఘకాల ప్రక్రియ. అందువల్ల వ్యక్తులు వీలైనంత త్వరగా పొదుపు చేయడం ప్రారంభించాలి. తద్వారా తగినంతగా వారు జీవితాంతం ఆదాయం పొందగలరు.
 
ఈ అధ్యయనం ప్రకారం, 65% మంది ప్రజలు యాన్యుటీ ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కేవలం 32% మంది మాత్రమే యాన్యుటీ ఉత్పత్తులలో పెట్టుబడి పెడుతున్నారు. నూతన తరపు యాన్యుటీ ప్లాన్స్‌అయిన ఐసిఐసిఐ ఫ్రు గ్యారెంటీడ్‌ పెన్షన్‌ ప్లాన్‌ ఫ్లెక్సీ వంటివి వినియోగదారులు రెగ్యులర్‌ తోడ్పాటునందించేందుకు, క్రమబద్ధంగా రిటైర్‌మెంట్‌ పొదుపు చేసుకునేందుకు తోడ్పడుతుంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

406 నగరాల్లో రిలయన్స్ జియో ట్రూ 5జీ సేవలు