Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కష్టమర్లకు షాకిచ్చిన ఐసీఐసీ బ్యాంక్... నేటి నుంచే అమలు

కష్టమర్లకు షాకిచ్చిన ఐసీఐసీ బ్యాంక్... నేటి నుంచే అమలు
, ఆదివారం, 1 ఆగస్టు 2021 (11:58 IST)
దేశంలోని కార్పొరేట్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంకు తన ఖాతాదారులకు తేరుకోలేని షాకిచ్చింది. ఈ బ్యాంకు సేవలకు సంబంధించిన పలు చార్జీలను సవరించింది. ఇవి ఆగస్టు ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. 
 
ఈ కొత్త నిబంధనల మేరకు బ్యాంక్ కస్టమర్లు అదనపు చెక్ బుక్ పొందాలంటే ఫీజు చెల్లించుకోవాలి. ఒక ఏడాదిలో 25 చెక్కులతో కూడిన చెక్ బుక్ ఉచితంగా పొందొచ్చు. ఈ లిమిట్ దాటితే 10 చెక్కులతో కూడిన ప్రతి చెక్ బుక్‌కు రూ.20 చెల్లించుకోవాలి.
 
అలాగే, ఆగస్టు ఒకటో తేదీ నుంచి నెలలో తొలి 4 క్యాష్ విత్‌డ్రాయెల్‌పై ఎలాంటి చార్జీలు ఉండవు. తర్వాత బ్యాంక్ కస్టమర్లు రూ.1000 విత్‌డ్రాపై రూ.5 చార్జీ చెల్లింపుకోవాలి. ప్రతి నెలా రూ.లక్ష వరకు చార్జీలు లేకుండా పొందొచ్చు. 
 
లిమిట్ దాటితే గరిష్టంగా రూ.150 వరకు చార్జీ పడుతుంది. హోమ్ బ్రాంచ్‌కు ఈ చార్జీలు వర్తిస్తాయి. అదే నాన్ హోమ్ బ్రాంచ్‌లో అయితే రోజుకు రూ.25 వేల వరకు తీసుకోవచ్చు. చార్జీలు ఉండవు. లిమిట్ దాటితే పైన పేర్కొన్న చార్జీలే పడతాయి.
 
బ్యాంక్ కస్టమర్లు నెలలో తొలి మూడు లావాదేవీలు (నాన్ బ్యాంక్ ఏటీఎం) చార్జీలు లేకుండా పొందొచ్చు. మెట్రో నగరాలకు ఇది వర్తిస్తుంది. ఈ లిమిట్ దాటితే ఒక్కో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.20, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.8.5 చెల్లించుకోవాలి. ఇతర ప్రాంతాల్లో అయితే 5 లావాదేవీలు నిర్వహించొచ్చు. చార్జీలు పడవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సరిహద్దుల్లో డ్రోన్ల్ కలకలం... భారత బలగాల్లో కలవరం